సాక్షి స్పెల్‌బీ–2018 తెలంగాణ రాష్ట్ర విజేతలు వీరే | This are the Sakshi Spell Bee 2018 Telangana state winners | Sakshi
Sakshi News home page

సాక్షి స్పెల్‌బీ–2018 తెలంగాణ రాష్ట్ర విజేతలు వీరే

Published Mon, Feb 18 2019 1:53 AM | Last Updated on Mon, Feb 18 2019 1:53 AM

This are the Sakshi Spell Bee 2018 Telangana state winners

హైదరాబాద్‌: ‘సాక్షి’ మీడియా గ్రూప్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సాక్షి  స్పెల్‌బీ–2018 (కేటగిరీ–1, 2, 3, 4, తెలంగాణ రాష్ట్రం) విజేతలను ప్రకటించారు. వేలాది మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలు ఎంతో ఉత్కంఠగా కొనసాగాయి. చివరగా నిర్వహించిన ఫైనల్స్‌లో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా విజేతలు, వారి తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో  ఇంగ్లిష్‌ భాషపై అంతర్గతంగా ఉన్న భయాలు పోగొట్టి, వారికి ఇంగ్లిష్‌లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడంతో పాటు గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఈ పోటీలు కలిగించాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సాక్షి యజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.

కేటగిరీ–1:
ప్రథమ బహుమతి:
హైదరాబాద్‌లోని కెన్నడీ హై ద గ్లోబల్‌ స్కూల్‌(బాచుపల్లి)లో చదువుతున్న ‘అథర్వ్‌ మిశ్రా’ కైవసం చేసుకున్నారు. విజేతకు బంగారు పతకంతో పాటు రూ. 15వేలు, సర్టిఫికెట్, డ్యూక్స్‌ గిప్ట్‌ హాంపర్‌ అందజేశారు.
ద్వితీయ బహుమతి:
హైదరాబాద్‌లోని మెరీడియన్‌ స్కూల్‌ (మాధాపూర్‌)లో చదువుతున్న ‘సిద్ధాంత్‌ చోవిశ్యా’ కైవసం చేసుకున్నారు. విజేతకు రజత పతకంతో పాటు రూ. 10వేలు, సర్టిఫికెట్, డ్యూక్స్‌ గిప్ట్‌ హాంపర్‌ అందజేశారు.
తృతీయ బహుమతి:
హైదరాబాద్‌లోని గ్లెండల్‌ క్రియేటివ్‌ ఆర్ట్స్‌ అకాడమీ స్కూల్‌(తెల్లాపూర్‌)లో చదువుతున్న ‘కర్ణన్‌ తిరూ’ కైవసం చేసుకున్నారు. విజేతకు కాంస్య పతకంతో పాటు రూ. 5,000లు, సర్టిఫికెట్, డ్యూక్స్‌ గిఫ్ట్‌ హాంపర్‌ అందజేశారు.

కేటగిరీ–2: 
ప్రథమ బహుమతి:
హైదరాబాద్‌లోని భారతీయ విద్యాభవన్‌ పబ్లిక్‌ స్కూల్‌(జూబ్లిహిల్స్‌)లో చదువుతున్న ‘అనిమేశ్‌ పాణిగ్రాహి’ కైవసం చేసుకున్నారు. విజేతకు బంగారు పతకంతో పాటు రూ. 15వేలు, సర్టిఫికెట్, డ్యూక్స్‌ గిప్ట్‌ హాంపర్‌ అందజేశారు.
ద్వితీయ బహుమతి:
హైదరాబాద్‌లోని కెన్నడీ హై ద గ్లోబల్‌ స్కూల్‌(బాచుపల్లి)లో చదువుతున్న ‘అనుష్‌ గుడిమెట్ల’  కైవసం చేసుకున్నారు. విజేతకు రజత పతకంతో పాటు రూ. 10వేలు, సర్టిఫికెట్, డ్యూక్స్‌ గిప్ట్‌ హాంపర్‌ అందజేశారు.
తృతీయ బహుమతి:
హైదరాబాద్‌లోని కెన్నడీ హై ద గ్లోబల్‌ స్కూల్‌(బాచుపల్లి)లో చదువుతున్న ‘హిమజ ద్రోణంరాజు’ కైవసం చేసుకున్నారు. విజేతకు కాంస్య పతకంతో పాటు రూ. 5,000లు, సర్టిఫికెట్, డ్యూక్స్‌ గిఫ్ట్‌ హాంపర్‌ అందజేశారు.

కేటగిరీ–3: 
ప్రథమ బహుమతి:
హైదరాబాద్‌లోని చిరక్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌(కొండాపూర్‌)లో చదువుతున్న ‘అరిట్రో రే’ కైవసం చేసుకున్నారు. విజేతకు బంగారు పతకంతో పాటు రూ. 15వేలు, సర్టిఫికెట్, డ్యూక్స్‌ గిప్ట్‌ హాంపర్‌ అందజేశారు.
ద్వితీయ బహుమతి:
హైదరాబాద్‌లోని చిరక్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌(కొండాపూర్‌)లో చదువుతున్న ‘దిశా సోమేంద్ర’  కైవసం చేసుకున్నారు. విజేతకు రజత పతకంతో పాటు రూ. 10వేలు, సర్టిఫికెట్, డ్యూక్స్‌ గిప్ట్‌ హాంపర్‌ అందజేశారు.
తృతీయ బహుమతి:
హైదరాబాద్‌లోని కెన్నడీ హై ద గ్లోబల్‌ స్కూల్‌(బాచుపల్లి)లో చదువుతున్న ‘ఆధ్యాష ఆచార్య’ కైవసం చేసుకున్నారు. విజేతకు కాంస్య పతకంతో పాటు రూ. 5,000లు, సర్టిఫికెట్, డ్యూక్స్‌ గిఫ్ట్‌ హాంపర్‌ అందజేశారు.

కేటగిరీ–4: 
ప్రథమ బహుమతి:
హైదరాబాద్‌లోని గీతాంజలి దేవశాలలో చదువుతున్న ‘మ్రిణల్‌ కుట్టేరీ’ కైవసం చేసుకున్నారు. విజేతకు బంగారు పతకంతో పాటు రూ. 15వేలు, సర్టిఫికెట్, డ్యూక్స్‌ గిప్ట్‌ హాంపర్‌ అందజేశారు.
ద్వితీయ బహుమతి: 
హైదరాబాద్‌లోని భారతీయ విద్యాభవన్‌ పబ్లిక్‌ స్కూల్‌(జూబ్లిహిల్స్‌)లో చదువుతున్న ‘వీ. కృష్ణ సాయి గాయత్రి’  కైవసం చేసుకున్నారు. విజేతకు రజత పతకంతో పాటు రూ. 10వేలు, సర్టిఫికెట్, డ్యూక్స్‌ గిప్ట్‌ హాంపర్‌ అందజేశారు.
తృతీయ బహుమతి:
హైదరాబాద్‌లోని రాక్‌వెల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌(కోకాపేట్‌)లో చదువుతున్న ‘ స్పర్శ్‌ లవాటే’ కైవసం చేసుకున్నారు. విజేతకు కాంస్య పతకంతో పాటు రూ. 5,000లు, సర్టిఫికెట్, డ్యూక్స్‌ గిఫ్ట్‌ హాంపర్‌ అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement