సాక్షి, వరంగల్/హైదరాబాద్: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను పోలీసులు కోర్టులో హజరుపర్చారు. కమలాపూర్, కరీంనగర్ టూటౌన్‌లో సంజయ్‌పై పేపర్ లీకేజీ కేసు నమోదైంది. ఆయనను హన్మకొండలో మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. కోర్టు పరిసరాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
ఏ1గా బండి సంజయ్..
టెన్త్ పేపర్ లీక్ కేసులో ఏ1గా బండి సంజయ్ పేరును చేర్చారు. ఏ2 ప్రశాంత్, ఏ3 మహేష్, ఏ4గా మైనర్ బాలుడు, ఏ5గా శివగణేష్‌ను పోలీసులు చేర్చారు. 120(బి) సెక్షన్ కింద సంజయ్‌పై కేసు నమోదు చేశారు.
హన్మకొండలో తీవ్ర ఉద్రిక్తత..
హన్మకొండ కోర్టు వద్ద బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సంజయ్‌ను తీసుకెళ్తున్న వాహనంపై చెప్పులు విసిరారు. బండి సంజయ్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు.
లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన తెలంగాణ బీజేపీ ఎంపీలు
లోక్‌సభ స్పీకర్‌ను తెలంగాణ బీజేపీ ఎంపీలు కలిశారు. బండి సంజయ్ అరెస్ట్‌పై ఫిర్యాదు చేశారు. కాగా, బీజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్టుపై హైడ్రామా కొనసాగింది. థ్రిల్లర్ సినిమా తలపించేలా పలు ప్రాంతాలు తిప్పారు. అసలు బండి సంజయ్‌ని ఎందుకు అరెస్టు చేశారో చెప్పకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీజేపి లీగల్ సెల్ ఆందోళన వ్యక్తం చేసింది.
పేపర్ బయటకు వచ్చిన కేసులో అనౌన్ పర్సన్ అని ఎఫ్ఐఆర్‌లో చూపి కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగా బండి సంజయ్ ని అరెస్టు చేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ కేసులను, అరెస్టులను న్యాయపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేస్తున్నారు. బెయిలేబుల్ కేసులే అయినప్పటికీ దొంగలా రహస్యంగా కోర్టుకు తరలించడమేంటని ప్రశ్నిస్తున్నారు.
టీఎస్‌పీఎస్సీ, టెన్త్ పేపర్ లీకేజీలో కుట్ర ఉంది: మంత్రి సబితా
ఇదిలా ఉండగా, టీఎస్‌పీఎస్సీ, టెన్త్ పేపర్ లీకేజీలో కుట్ర ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ పెద్దల పర్యవేక్షణలోనే బండి సంజయ్ కుట్ర చేశారంటూ ఆమె ఆరోపించారు. స్వార్థ రాజకీయాల కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. నిందితులకు బీజేపీ నాయకులతో సంబంధాలున్నాయన్నారు. కేసీఆర్ సర్కార్‌ను అప్రతిష్టపాలు చేయాలనే కుట్రతోనే పేపర్ లీక్‌కు పాల్పడ్డారని మంత్రి సబితా మండిపడ్డారు.
చదవండి: అర్థరాత్రి అరెస్ట్.. అసలేం జరిగిందో చెప్పిన బండి సంజయ్ సతీమణి
Comments
Please login to add a commentAdd a comment