సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో బాలశ్రీ అవార్డ్‌లకు ఎంపిక కావటం రాష్ట్ర ప్రభుత్వానికి గర్వకారణమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. కాలానుగుణంగా విద్యాబోధనలో మార్పులు చేయాలని, సృజనాత్మకతకు పదునుపెట్టే ఆవిష్కరణలతో విద్యార్థులను ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు మంత్రి స్పష్టం చేశారు.
హైదరాబాద్ హెచ్‌ఆర్‌డీలో శుక్రవారం జాతీయ బాలశ్రీ అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్యఅతిథిగా సబిత పాల్గొన్నారు. అవార్డుకు ఎంపికైన పదిమంది విద్యార్థులకు పురస్కారాలను ప్రదానం చేశారు. దీంతో పాటు రూ.15 వేల నగదు, కిసాన్ వికాస్ పత్రం, 6 సెట్ల బుక్స్, ఒక జత డ్రెస్ ఇతరత్రా వాటిని మంత్రి అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment