సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సీఎం రేవంత్.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై కామెంట్స్ నేపథ్యంలో ఆమె కన్నీరుపెట్టుకున్నారు. తనను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్..
- కాంగ్రెస్‌లో ఉండి ఇక్కడ ముంచి అక్కడి వెళ్లారు.
- బీఆర్‌ఎస్ నేతల వెనుక ఉన్న అక్కలను నమ్మితే అంతే..
- వాళ్ల మాటలు వింటే జూబ్లీ బస్టాండ్‌లో నిలబడాల్సి వస్తుంది.
- బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క మహిళలకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు.
- సబితను సొంత అక్కగానే భావించాను.
కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు కన్నీరు పెట్టిన సబితా ఇంద్రారెడ్డి.
- అసెంబ్లీలో సబిత భావోద్వేగం.
- నన్ను ఎందుకు టార్గెట్ చేశారు.
- రేవంత్ ఏ పార్టీ నుంచి వచ్చారు.
- కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నాను.
- పార్టీ మార్పులపై చర్చ జరగాలి.
- రేవంత్‌ను కాంగ్రెస్‌లోకి నేనే ఆహ్వానించాను.
- ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లు పార్టీలు మారి రాలేదా?
- అక్కడున్న కాకి మా ఇంటి మీద వాడితే కాల్చుతా అన్నారు రేవంత్ రెడ్డి.
- రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించింది నేనే.
- ఒక ఆడబిడ్డకు బాధ అవుతుంటే వినే స్థితిలో లేరా?
- సీఎం రేవంత్ రెడ్డి నన్ను ఎందుకు టార్గెట్ చేశారు?
- వెనక కూర్చున్న అక్కలు ఎవరిని మోసం చేశారు?
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించి భవిష్యత్తు చూపించాం.
- ముఖ్యమంత్రి ఎవరిని అవమానిస్తున్నారు ఆలోచన చేసుకోవాలి?
- ఆడిబిడ్డలాగా ఉన్న మేము ఎవరిని మోసం చేసాము?
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్..
- అక్కగా నేను సబితా ఇంద్రారెడ్డిని నమ్మాను.
- నన్ను మల్కాజిగిరిలో పోటీ చేయమని చెప్పి.. కాంగ్రెస్‌ను వదిలి బీఆర్ఎస్‌లోకి వెళ్లారు.
- ఒకవైపు నన్ను మల్కాజిగిరిలో పోటీ చేయమని.. మరోవైపు కేసీఆర్ మాటలు నమ్మి ఆ పార్టీలో చేరారు.
- మల్కాజ్‌గిరిలో పోటీ చేయమని, బీఆర్ఎస్‌లో చేరి మంత్రి పదవి పొందారు.
- రాజ్ భవన్ వెళ్లి వచ్చాక అన్ని అంశాలపై సమాధానాలు చెప్తా అన్ని విషయాలు బయటపెడతాను.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్..
- కాంగ్రెస్ పార్టీ సబితా ఇంద్రారెడ్డికి ప్రాధాన్యత ఇచ్చింది.
- పదేండ్లు మంత్రి పదవి ఇచ్చి గౌరవించింది.
- 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు.
- కాంగ్రెస్ పార్టీ దళిత నేతగా ఉన్న నాకు సీఎల్పీ, ఎల్‌ఓపీగా బాధ్యతలు ఇచ్చారు.
- సబితా ఇంద్రారెడ్డి రెడ్డి నా వెనుక ఉండి నన్ను సీఎల్పీ, ఎల్ఓపీగా కాకుండా అధికారం కోసం పార్టీ మారారు.
- సబితా ఇంద్రారెడ్డి ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేస్తున్నారు.
- కాంగ్రెస్ పార్టీ పరువు తీసి, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు సబితా ఇంద్రారెడ్డి.
- డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై మరోసారి ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్
- స్పీకర్ పోడియం ముందు వచ్చి నిరసన చేస్తున్న ఎమ్మెల్యేలు.
- మహిళా నాయకురాళ్లపై మంత్రులుగా ఉండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా అంటున్న బీఆర్ఎస్.
బీఆర్‌ఎస్ నేతల నిరసన..
- స్పీకర్ పోడియం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన.
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళనపై స్పీకర్ ఆగ్రహం.
- రెండు గంటలు సమయం ఇచ్చిన చైర్‌కు బీఆర్ఎస్ మర్యాద ఇవ్వడం లేదు.
- మహిళలను రెచ్చగొట్టడం సరైన పద్ధతి కాదు
- ఎంత అవకాశం ఇచ్చిన నిరసన చేయడం సరైన పద్ధతి కాదు.
Comments
Please login to add a commentAdd a comment