సాక్షి, హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు(Formula E Car Race Case)లో కేటీఆర్(KTR) ఈడీ విచారణ ముగిసింది. దాదాపు ఏడు గంటల పాటు ఆయనను ఈడీ ప్రశ్నించింది. నగదు బదిలీపైనే కేటీఆర్‌ను ఈడీ(ED) ప్రశ్నించింది. విచారణ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అడిగిన ప్రశ్ననే పదేపదే అడిగారు. ఎన్ని సార్లు అయినా విచారణకు వస్తానని చెప్పా. రేవంత్‌పై ఏసీబీ కేసు ఉందని.. నాపై ఏసీబీ కేసు బనాయించారు. రేవంత్‌పై ఈడీ కేసు ఉందని.. నాపై ఈడీ కేసు బనాయించారు.’’ అని ఆయన మండిపడ్డారు
‘‘న్యాయ స్థానాలపై మాకు విశ్వాసం ఉంది. లైడిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం.. రేవంత్ సిద్ధమా?. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఎన్ని ప్రశ్నలు అడిగిన సమాధానం చెబుతా. నేను ఎలాంటి తప్పు చేయలేదు’’ అని కేటీఆర్ చెప్పారు.
‘‘భారత రాజ్యాంగాన్ని, చట్టాన్ని, చట్టాలను గౌరవించే పౌరుడిని.. ఏ తప్పు చేయకపోయినా అవినీతికి పాల్పడకపోయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగా కేసు పెడితే విచారణ సంస్థలను గౌరవించి విచారణకు హాజరయ్యారు. ఏసీబీ కేసు పెట్టింది కాబట్టి ఈడీ కూడా కేసు పెట్టి ఈ రోజు విచారణకు పిలిస్తే హాజరయ్యాను. రెండు సంస్థలు కూడా ఒకే రకమైన ప్రశ్నలు అడిగాయి.
ఇదీ చదవండి: ఈడీ విచారణకు కేటీఆర్.. ఎమ్మెల్యే రాజాసింగ్ సెటైరికల్ ట్వీట్
..రెండు సంస్థలు ఎన్నిసార్లు పిలిచినా వస్తా. ఎన్ని ప్రశ్నలు అడిగినా చెప్తా. పూర్తిగా విస్తరణ సహకరిస్తాను అని చెప్పాను. తప్పకుండా నా నిజాయితీని రుజువు చేసుకుంటానని చెప్పాను. ఈ విచారణకు దాదాపు 5 నుంచి 10 కోట్లు ఖర్చు అవుతుంది. నేను నిజాయితీపరుడ్ని.. ధైర్యంగా ఎదుర్కొంటా. 10 కోట్ల రూపాయలతో రైతులకు రుణమాఫీ చేయొచ్చు. పెన్షన్ ఇయ్యొచ్చు. రేవంత్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే జడ్జి ముందు కూర్చుందాం. మీకు ఇష్టమైన న్యాయమూర్తి ఎవరి ముందైనా కూర్చుందాం. నేను రేవంత్ రెడ్డి న్యాయమూర్తి ముందు కూర్చుంటాం.. ఇద్దరికీ లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. ఒక 50 లక్షల రూపాయలతో ఓడిసిపోతుంది విచారణ. అనవసరంగా 10 కోట్ల ఖర్చు ఎందుకు?’’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment