సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 40 ప్రభుత్వ పాఠశాల్లో 9, 10 చదివే విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో అదనపు తరగతుల నిర్వహణకు అనుమతించాలని ప్రభుత్వ హెచ్‌ఎంల సంఘం రాష్ట్ర నేతలు రాజాభానుచంద్ర ప్రకాశ్, రాజుగంగారెడ్డి విద్యామంత్రి సబితా ఇంద్రా రెడ్డిని కోరారు. టెన్త్ ఫీజు చెల్లించే తేదీలు ప్రక టించినా ఇంకా ఇంగ్లిష్ మీడియానికి అను మతించలేదని, దీంతో విద్యార్థులకు నష్టం జరుగుతోందని తెలిపారు. వెంటనే ఉపాధ్యా య బదిలీలు చేపట్టాలని, తమ సంఘం లేవ నెత్తిన అనేక అంశాలు పెండిగ్‌లో ఉన్నాయని మంత్రికి వివరించారు. తమ విజ్ఞప్తిపై సబిత సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు
Comments
Please login to add a commentAdd a comment