విద్యాశాఖ మంత్రి కార్యాలయం ముట్టడిలో ఎంపీ ఆర్.కృష్ణయ్య తదితరులు
గన్‌ఫౌండ్రీ: రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. శుక్రవారం నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 44 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ బషీర్‌బాగ్‌లోని విద్యాశాఖమంత్రి కార్యాలయాన్ని ముట్టడించారు.
ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ తాత్కాలిక ఉపాధ్యాయుల ద్వారా కాకుండా శాశ్వత ఉపాధ్యాయుల భర్తీలను చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. త్వరలో ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ చేపడతామని మంత్రి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో నాయకులు గుజ్జ కృష్ణ, నీలం వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment