![R Krishnaiah Demands Telangana Government To Solve Academic Issues - Sakshi](/styles/webp/s3/article_images/2020/09/28/R-Krishnaiah.jpg.webp?itok=Fd1DDSUp)
ముషీరాబాద్ (హైదరాబాద్): రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించి, ఖాళీ టీచర్ పోస్టులను భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం విద్యానగర్‌లోని రాష్ట్ర బీసీ భవన్‌లో తెలంగాణ బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సంఘం వ్యవస్థాపకుడు సుతారపు వెంకట నారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడారు. విద్యారంగ సమగ్ర వికాసానికి ఉపాధ్యాయుల సహకారం చాలా అవసరమని పేర్కొన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీ గా ఉన్న 40 వేల టీచర్ల పోస్టులను వెంటనే భర్తీ చేసి ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయాలన్నారు.
రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక..
తెలంగాణ బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా సుతారపు వెంకట నారాయణ, ఉపాధ్యక్షుడిగా పరంకుశం కుమారస్వామి, ప్రధాన కార్యదర్శిగా ఉప్పు మధుకర్, సం యుక్త కార్యదర్శిగా కె.శ్రీనివాస్, కోశాధికారిగా నరేందర్‌లు ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment