
సాక్షి, హైదరాబాద్: విద్యావ్యవస్థలో సమూల మార్పులు చేశామని, కేజీ టు పీజీ వరకు ఉచిత, నాణ్యమైన విద్య అందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ‘మన ఊరు మన బడి... మన బస్తీ మన బడి’ పథకంపై సభ్యుల ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. మంత్రి సబిత ఏమన్నారంటే..
►మూడు దశల్లో స్కూళ్లను ఆధునీకరిస్తాం. రూ. 7,289.54 కోట్ల మొత్తం బడ్జెట్ ఖర్చుతో 26,065 పాఠశాలల్లో పనులు చేపడతాం.
►మొదటి దశలో రూ. 3,497.62 కోట్ల అంచనా బడ్జెట్‌తో బడులను బాగు చేస్తాం. మొదటి దశలోనే 9,123 స్కూళ్లను ఎంపిక చేశాం. మన ఊరు–మన బడి పథకంలో పూర్వ విద్యా ర్థులను, దాతలను భాగ స్వాములను చేస్తాం. ఇప్పటికే ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆయన చది విన స్కూలుకు రూ.3.5 కోట్ల విరాళం ఇచ్చారు.
►ఎవరైనా రూ.2 లక్షలు ఖర్చు చేస్తే స్కూలు సభ్యుడిగా ఉంచుతాం. రూ.10 లక్షలు ఖర్చు చేస్తే వారి పేరు పెడతాం.
►ప్రాథమికపాఠశాలకు రూ.25 లక్షలు, ప్రాథమికోన్నత పాఠశాలకు రూ.50 లక్షలు, ఉన్నత పాఠశాలకు కోటి ఖర్చు చేస్తే దాతల పేర్లు పెడతాం.
ఉపాధ్యాయులకు ఆంగ్లంలో శిక్షణ...
టీచర్లకు 14 నుంచి ఆంగ్లభాషపై శిక్షణ ఇస్తామని సబిత తెలిపారు. విద్యాశాఖలో త్వరలోనే 21 వేల పోస్టులు భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలో 973 గురు కులాలను ఏర్పాటు చేస్తే అడ్మిషన్లు కావాలని ఒత్తిళ్లు వస్తున్నాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment