
సాక్షి, హైదరాబాద్: రామాంతాపూర్ నారాయణ కాలేజ్ ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీరియస్ అయ్యారు. నారాయణ కాలేజీలో జరిగిన సంఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ఇంటర్ బోర్డు కార్యదర్శిని సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. విచారణ నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి సబితా పేర్కొన్నారు. భవిష్యుత్తలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలని ఆమె సూచించారు.
కాగా రామంతాపూర్ నారాయణ కాలేజీలో సెంకడ్ ఇయర్ పూర్తి చేసుకున్న విద్యార్థి సాయి నారాయణ.. విద్యార్థి సంఘం నాయకుడు సందీప్‌తో కలిసి కాలేజ్‌కు వచ్చాడు. టీసీ ఇవ్వాలంటే డ్యూ ఉన్న రూ. 16 వేల ఫీజు చెల్లించాలని ప్రిన్సిపాల్ సుధాకర్ చెప్పాడు. ఈ క్రమంలో విద్యార్థి నేత, నారాయణ ప్రిన్సిపాల్ మధ్య వాగ్వాదం తలెత్తింది. ఫీజు విషయంలో ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి వెనక్కి తగ్గకపోవడంతో విద్యార్థి నేత సందీప్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు.
మొత్తం ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థినేత సందీప్ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రమాదంలో గాయపడిన ముగ్గురిని ముందుగా గాంధీ ఆసుపత్రికి, అక్కడి నుంచి యశోద ఆసుపత్రి పోలీసులు తరలించారు. అయితే యశోద ఆసుప్రతిలో బెడ్లు ఖాళీ లేకపోవడంతో డీఆర్‌డీఓ ఆసుపత్రికి తరలించారు. సందీప్ సహా వెంకటేష్‌చారీ, కాలేజ్ ఏవో అశోక్‌కు డీఆర్‌డీవో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment