
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేల జంపింగ్‌ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి, సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలె యాదయ్యలు పార్టీని వీడి అధికార కాంగ్రెస్‌లోకి చేరారు. ఈ క్రమంలో.. మరో ఐదుగురు ఉన్నారని, మాజీ మంత్రి సబితా రెడ్డి కూడా ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం ఒకటి నడుస్తోంది. అయితే..
సోషల్ మీడియా వేదికగా ఈ ప్రచారాన్ని ఖండించారామె. బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ తనకు సముచిత స్థానం కల్పించారన్న సబిత.. ఆయన సారధ్యంలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, పార్టీ మారాల్సిన అవసరంగానీ.. ఆ ఆలోచనగానీ తనకు లేవని అన్నారామె.
Comments
Please login to add a commentAdd a comment