
ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న మంత్రి సబితా
సాక్షి, హైదరాబాద్: మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గన్‌తో కాల్చుకుని ఫాజిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలాన్ని మంత్రి సబితా పరిశీలించారు.
ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనపై వెస్ట్ జోన్ డీసీపీ జోయెల్ డేవిస్ మీడియాతో మాట్లాడుతూ, ఫాజిల్ ఉదయం ఆరుగంటలకు గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, ప్రాథమిక దర్యాప్తులో ఆర్థిక సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోందన్నారు. కూతురితో మాట్లాడిన తర్వాత పిస్తోల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment