సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్-2022) ఫలితాల విడుదలపై రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం కీలక ప్రకటన చేసింది. ఫలితాల్లో జాప్యానికి ఆస్కారం లేకుండా జులై 1 న విడుదల చేస్తామని వెల్లడించింది. ఈమేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం నాడు తన కార్యాలయంలో విద్యా శాఖ పనితీరును ఆమె సమీక్షించారు.
సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, విద్యాశాఖ సంచాలకులు దేవసేన, ఎస్‌ఈఆర్‌టీ డైరెక్టర్ రాధారెడ్డి, ప్రభుత్వ పరీక్షల సంచాలకులు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జులై 1న టెట్ ఫలితాలను విడుదల చేయాలని విద్యాశాఖ మంత్రి అధికారులను ఆదేశించారు.
చదవండి👇
టెట్ @ 90 శాతం
ఇంటర్ ఫలితాలు విడుదల.. ఒకే క్లిక్‌లో రిజల్ట్స్ ఇలా చూడండి
Comments
Please login to add a commentAdd a comment