సాక్షి, హైదరాబాద్: నిజాం కళాశాలలో నూతనంగా నిర్మించిన హాస్టల్ పూర్తిగా యూజీ విద్యార్థులకే కేటాయిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. మంగళవారం నాడు తన కార్యాలయంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, నిజాం కళాశాల ప్రిన్సిపాల్, నిజాం కళాశాల విద్యార్థినులతో సమావేశమయ్యారు.
నిజాం కళాశాల విద్యార్థినుల సమస్యను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సూచన మేరకు ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మార్గదర్శక నిబంధనలకు అనుగుణంగా వసతి కల్పించాలని అధికారులను ఆదేశించారు.
విద్యార్థినులందరూ దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్ర చరిత్రలోనే మొదటి సారిగా నిజాం కళాశాలలో యుజీ విద్యార్థినులకు వసతి సౌకర్యం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. విద్యార్థినులకు కావాల్సిన ఏర్పాట్లను చేయాలని నిజాం కళాశాల ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు.
చదవండి: (అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లపై తేల్చేసిన సీఎం కేసీఆర్)
Comments
Please login to add a commentAdd a comment