సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, టీఆర్‌ఎస్ ప్రభుత్వం మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ఈ క్రమంలో గవర్నర్.. బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో కేసీఆర్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారనే అనుమానం ఉందంటూ ఆమె వ్యాఖ్యానించారు.
తమిళిసై కామెంట్స్‌పై ఇప్పుడే స్పందించనని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తను ఎక్కడా రాజ్‌భవన్‌ను డీగ్రేడ్ చేసేలా మాట్లాడలేదని సబిత అన్నారు. ప్రెస్‌మీట్ నిర్వహించి త్వరలో అన్ని వివరాలు చెప్తానని మంత్రి అన్నారు. మరోవైపు గవర్నర్‌ను మంత్రి కలిసేందుకు అపాయింట్‌మెంట్ అడిగినా స్పందన లేదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
చదవండి: తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు
కాగా, రాష్ట్రంలో అప్రజాస్వామిక పరిస్థితులు ఉన్నాయంటూ మీడియా సమావేశంలో గవర్నర్ విమర్శలు గుప్పించారు. రాజ్‌భవన్.. ప్రగతిభవన్‌లా కాదు.. రాజ్‌భవన్‌కు ఎవరైనా ఎప్పుడైనా రావొచ్చన్నారు. ప్రభుత్వం నుంచి కొన్ని బిల్లులు వచ్చాయని వాటిపై వివరణ అడిగానని బిల్లులు సమగ్రంగా పరిశీలించేందుకు సమయం తీసుకున్నానని, ఈ లోపే తప్పుడు ప్రచారం జరిగిందని గవర్నర్ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment