హన్మకొండ చౌరస్తా: ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వెల్‌నెస్ సెంటర్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి వ్యక్తి ఆరోగ్యవంతంగా ఉండేందుకు ప్రభుత్వం నాలుగు విధానాలను అమలు చేస్తుందన్నారు.
ఇందులో భాగంగా వ్యాక్సినేషన్ నుంచి వ్యాధి నిర్ధారణలో కీలకమైన డయాగ్నొస్టిక్ సెంటర్లు, వైద్య పరికరాలు, డాక్టర్ల సంఖ్యను పెంచిందన్నారు. త్వరలో ప్రతి వ్యక్తికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ఎన్‌సీడీ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా జనగామ జిల్లాను ఎంపిక చేసినట్లు చెప్పారు. సరికొత్త ఎంప్లాయీస్, జర్నలిస్టుల హెల్త్ స్కీం కేవలం తెలంగాణలోనే అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ పి.దయాకర్, ఎమ్మెల్సీ పూల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
నిమ్స్ పనులను త్వరగా పూర్తి చేయాలి
బీబీనగర్: నిమ్స్ ఆస్పత్రి పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశించారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ వద్ద ఉన్న నిమ్స్‌ను సందర్శించారు. ఇన్‌పేషెంట్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నందున ఆస్పత్రి భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు. త్వరలో ఇన్‌పేషెంట్ విభాగాన్ని ప్రారంభిం చనున్న నేపథ్యంలో అందుకు అవసరమ య్యే వైద్యులు, సిబ్బంది నియామకాలు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. మంత్రి వెంట నిమ్స్ డైరెక్టర్ మనోహర్, సూపరింటెండెంట్ మహేశ్వర్‌రెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment