రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి లక్ష్మారెడ్డి
వంగూరు : చెరువులు నిండి రైతుల బతుకులు పండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్రంలో చెరువులన్నింటినీ పునరుద్ధరించేందుకు నిర్ణయించారని, రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెంచేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి వంగూరు మండలం చారకొండ గ్రామ పెద్ద చెరువు పనులను, చారకొండ ఉన్నత పాఠశాల అదనపు గదుల నిర్మాణం పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పునఃనిర్మాణంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేపడుతున్నారన్నారు.
ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్నానని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు భీముడు నాయక్, సర్పంచులు శిల్పాదేవీలాల్, రాంకొండ, సువర్ణ తిరుమలేష్, ఎంపీటీసీ సభ్యులు చెన్నమ్మ, చిన్న ఇదమయ్య, చరిత, టీఆర్‌ఎస్ నాయకులు కృష్ణారెడ్డి, హమీద్, విజయేందర్‌గౌడ్, గురువయ్యగౌడ్, సురేందర్‌రెడ్డి, శ్రీపతిరావు, జేసీబీ వెంకటయ్య, రమేష్, ప్రవీణ్‌రెడ్డి, కర్ణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చెరువులు నిండాలి... బతుకులు పండాలి
Published Sat, May 2 2015 1:31 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM
Advertisement