సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో రెండ్రోజుల పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తొలిరోజు హుస్నాబాద్, మానకొం డూరు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించడంతోపాటు పలు వరాలు కురిపించారు. హుస్నాబాద్ సమగ్రాభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటానని చెప్పిన కేసీఆర్ ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.10 లక్షల చొప్పున నియోజకవర్గంలోని 121 గ్రామ పంచాయతీలకు రూ.12.10 కోట్లు మంజూరు చేస్తున్నుట్ల ప్రకటించారు. దీంతోపాటు హుస్నాబాద్ పంచాయతీ భవన్ నిర్మాణానికి రూ.కోటి కేటాయిస్తామన్నారు. వీటికి సంబంధించి రెండ్రోజుల్లోనే జీవో విడుదల చేయిస్తానని చెప్పారు.
హుస్నాబాద్ సభా వేదికపైకి వస్తుండగా కేసీఆర్‌కు పాత మిత్రుడు, ఉపాధ్యాయ సంఘ నాయకుడు లక్ష్మారెడ్డి ఎదురుపడ్డారు. స్థానికం గా ఉన్న మహాసముద్రానికి గండి పడటంతో ఇబ్బందులున్నాయని, ఆదుకోవాలని కోరారు. అనంతరం కేసీఆర్ సభలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ‘‘ఉపాధ్యాయ నాయకుడు లక్ష్మారెడ్డి నాకు పాత మిత్రుడు. వేదికపైకి వస్తుంటే మహాసముద్రం అనే గండి పడింది.
దానిని బాగు చేస్తే 15 గ్రామాలు బాగుపడతాయన్న డు. దానికి వెంటనే అంచనాలు రూపొందిస్తా. రూ.4 కోట్లు మంజూరు చేయిస్తా. యుద్ధప్రాతిపదికన పనులు చేయిస్తా. ఇలాంటి మంచి పనులేమైనా ఉంటే చెప్పండి. చేసేస్తా’’ అని అన్నారు. హుస్నాబాద్‌లో ప్రతి ఇంటికీ సాగు, తాగునీరు తెచ్చే బాధ్యత నాదే. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తా... ఈ ప్రాంతం బాగు పడాలని ఆకాంక్షించారు.
నాగసముద్రం వద్ద మోడల్ స్కూల్‌లో మొ క్కలు నాటుతుండగా సర్పంచ్ పాఠశాలకు కాంపౌండ్ వాల్ లేదని ప్రస్తావించారు. వెంటనే ఆ స్కూల్‌కు ప్రహారీగోడకు అయ్యే నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నాగసముద్రానికి రోజుకు ఒకే ట్రిప్పు బస్సు వస్తోందని స్థానికులు చెప్పగా, అవసరమైనన్ని ట్రిప్పులు తిరిగేలా ఆర్టీసీ అధికారులకు ఆదేశాలి వ్వాలని కలెక్టర్ నీతూప్రసాద్‌కు సూచించారు.
అక్కడి నుండి చిగురుమామిడి మండలం చిన ముల్కనూరు గ్రామానికి వచ్చిన సీఎం ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. తాను అప్పుడప్పుడు ఇక్కడికి వస్తానని, హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేసుకుంటానని చెప్పారు. తక్షణమే రూ.50 లక్ష లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
అనంతరం మానకొండూరు నియోజకవర్గం లోని నుస్తులాపూర్‌కు వచ్చిన సీఎం 16ఎకరాల్లోనున్న ప్రభుత్వ పాఠశాలకు ప్రహారీగోడను నిర్మించేందుకు తగిన నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.
అక్కడి నుండి అలుగునూరు వచ్చిన కేసీఆర్ ఆ గ్రామాభివృద్ధికి రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తమకు ఇళ్లులేవని పేర్కొంటూ కొందరు స్థానికులు సీఎంకు వినతిపత్రం ఇవ్వగా వెంటనే స్పందిస్తూ ‘‘అలుగునూరులో ఇల్లులేని వారికి ఎస్సారెస్పీ పరిధిలోని రెండెకరాల స్థలంలో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి ఇస్తా’’అని హామీ ఇచ్చారు.
సీఎం వరాల జల్లు
Published Sun, Jul 5 2015 1:45 AM | Last Updated on Sun, Sep 3 2017 4:53 AM
Advertisement
Advertisement