ఐలాపురం రాజా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్‌గా ఐలాపురం రాజా నియామకం వివాస్పదంగా మారింది. రాజా ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో జన చైతన్యవేదిక అధ్యక్షులు లక్ష్మణ్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. లంచ్‌మోషన్‌లో పిటిషనర్ తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. సెక్షన్-50లోని క్లాజ్3 నిబంధనలు ఉల్లంఘించి ఐలాపురం రాజాని నియమించారని పొన్నవోలు అర్గ్యుమెంట్ చేశారు. సెక్షన్-15 క్లాజ్ 6 ప్రకారం సమాచార కమిషనర్‌గా వ్యాపారస్తులని నియమించకూడదని చట్టంలో స్పష్టంగా ఉందని వాదించారు.
సేవాదృక్పధం, జ్ఞాన సంపత్తి లేని ఐలాపురం రాజా నియామకాన్ని రద్దు చేయాలని విన్నవించారు. ప్రభుత్వం మారే సమయంలో ఇష్టులకి పదవుల పందేరంలో భాగంగానే ఐలాపురం పేరు సూచించారని ఆరోపించారు. అర్గ్యుమెంట్స్ విన్న తర్వాత విచారణను ఈ నెల 29కి హైకోర్టు వెకేషన్ బెంచ్ వాయిదా వేసింది. అలాగే ఈ నెల 29న కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment