ilapuram
-
ఐలాపురం అడవుల్లో పెద్దపులి
ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం రేంజ్ ఐలాపురం అటవీ ప్రాంతంలో సోమవారం పెద్దపులి అడుగులను అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఎఫ్ఆర్ఓ ఆసిఫ్ పులి అడుగు జాడలపై డీఎఫ్వో ప్రదీప్కుమార్శెట్టికి సమాచారం ఇచ్చారు. పులి జాడను కనిపెట్టేందుకు కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేయాలని డీఎఫ్వో ఆదేశించడంతో పులి సంచరించే నీటి వసతి ఉన్న ప్రాంతాలు, వాగులు, చెలిమలు, కుంటల వద్ద కెమెరాలతో అన్వేషిస్తున్నారు. చదవండి: కే–4 ఆడ పులి.. దాని జాడేది? -
సమాచార కమిషనర్ నియామకం వివాదాస్పదం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్గా ఐలాపురం రాజా నియామకం వివాస్పదంగా మారింది. రాజా ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో జన చైతన్యవేదిక అధ్యక్షులు లక్ష్మణ్రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. లంచ్మోషన్లో పిటిషనర్ తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. సెక్షన్-50లోని క్లాజ్3 నిబంధనలు ఉల్లంఘించి ఐలాపురం రాజాని నియమించారని పొన్నవోలు అర్గ్యుమెంట్ చేశారు. సెక్షన్-15 క్లాజ్ 6 ప్రకారం సమాచార కమిషనర్గా వ్యాపారస్తులని నియమించకూడదని చట్టంలో స్పష్టంగా ఉందని వాదించారు. సేవాదృక్పధం, జ్ఞాన సంపత్తి లేని ఐలాపురం రాజా నియామకాన్ని రద్దు చేయాలని విన్నవించారు. ప్రభుత్వం మారే సమయంలో ఇష్టులకి పదవుల పందేరంలో భాగంగానే ఐలాపురం పేరు సూచించారని ఆరోపించారు. అర్గ్యుమెంట్స్ విన్న తర్వాత విచారణను ఈ నెల 29కి హైకోర్టు వెకేషన్ బెంచ్ వాయిదా వేసింది. అలాగే ఈ నెల 29న కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. -
భాదిత కుటుంబానికి ఆర్థికసాయం అందజేత
ఐలాపురం(చివ్వెంల) : మండల పరిధిలోని ఐలాపురం గ్రామానికి చెందిన ఆర్ఎంపీ మేలినాటి రామక్రిష్ణ ఇటివల గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి ఆర్ఎంపీల సంఘం ఆధ్వర్యంలో బుధవారం రూ.10 వేల ఆర్థికసాయం అందజేశారు. అదేవిధంగా గ్రామానికి చెందిన యూత్ ఆధ్వర్యంలో రూ.32వేలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో ఆర్ఎంపీల సంఘం జిల్లా అధ్యక్షుడు పుప్పాల లక్ష్మీనారాయణ, చివ్వెంల మండల అధ్యక్షుడు కె. వెంకన్న, శ్రీను. దామోదర్, జానయ్య, క్రిష్ణ, యూత్ సభ్యులు వెంకటరమణ, సతీష్, నాగరాజు, సైదులు, బాలక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.