
ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం రేంజ్ ఐలాపురం అటవీ ప్రాంతంలో సోమవారం పెద్దపులి అడుగులను అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఎఫ్‌ఆర్‌ఓ ఆసిఫ్ పులి అడుగు జాడలపై డీఎఫ్‌వో ప్రదీప్‌కుమార్‌శెట్టికి సమాచారం ఇచ్చారు. పులి జాడను కనిపెట్టేందుకు కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేయాలని డీఎఫ్‌వో ఆదేశించడంతో పులి సంచరించే నీటి వసతి ఉన్న ప్రాంతాలు, వాగులు, చెలిమలు, కుంటల వద్ద కెమెరాలతో అన్వేషిస్తున్నారు.
చదవండి: కే–4 ఆడ పులి.. దాని జాడేది?