
సాక్షి, మహబూబ్‌నగర్: ప్రజలకు మంచి చేస్తే మరచిపోతారని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు రద్దు చేయాలనే వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ జడ్చర్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి స్పందించారు. తాను అలా అనలేదని, తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించి ప్రసారం చేసిందని అన్నారు. పనిచేసే ప్రభుత్వాలను ప్రజలు గుర్తుంచుకోవాలని అర్ధం వచ్చేలా తాను నిన్న మాట్లాడానని చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వాలు ఏవైనా ప్రజలకు మేలు చేస్తే ఆ ప్రభుత్వాలను ఆదరించాలి. నేను నిన్న చేసిన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించి ప్రసారం చేశాయి’అని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్, జడ్చర్ల మండల కేంద్రాలలో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను లక్ష్మారెడ్డి మంగళవారం లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి. జనాలకు మంచిచేస్తే మరిచిపోయే అలవాటుందని, ఏడాదిపాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రద్దు చేయాలని కేసీఆర్‌ను కోరుతానని లక్ష్మారెడ్డి మాట్లాడినట్టు వార్తలు వెలువడ్డాయి. ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం లేపాయి. టీఆర్‌ఎస్ శ్రేణుల్లోనూ అసహనం వ్యక్తమైంది.
(చదవండి: 'జనాలకు మంచిచేస్తే మరిచిపోయే అలవాటుంది..')
Comments
Please login to add a commentAdd a comment