c laxmareddy
-
వ్యాఖ్యల దుమారంపై స్పందించిన లక్ష్మారెడ్డి
సాక్షి, మహబూబ్‌నగర్: ప్రజలకు మంచి చేస్తే మరచిపోతారని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు రద్దు చేయాలనే వ్యాఖ్యలపై టీఆర్ఎస్ జడ్చర్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి స్పందించారు. తాను అలా అనలేదని, తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించి ప్రసారం చేసిందని అన్నారు. పనిచేసే ప్రభుత్వాలను ప్రజలు గుర్తుంచుకోవాలని అర్ధం వచ్చేలా తాను నిన్న మాట్లాడానని చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వాలు ఏవైనా ప్రజలకు మేలు చేస్తే ఆ ప్రభుత్వాలను ఆదరించాలి. నేను నిన్న చేసిన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించి ప్రసారం చేశాయి’అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్, జడ్చర్ల మండల కేంద్రాలలో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను లక్ష్మారెడ్డి మంగళవారం లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి. జనాలకు మంచిచేస్తే మరిచిపోయే అలవాటుందని, ఏడాదిపాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రద్దు చేయాలని కేసీఆర్‌ను కోరుతానని లక్ష్మారెడ్డి మాట్లాడినట్టు వార్తలు వెలువడ్డాయి. ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం లేపాయి. టీఆర్ఎస్ శ్రేణుల్లోనూ అసహనం వ్యక్తమైంది. (చదవండి: 'జనాలకు మంచిచేస్తే మరిచిపోయే అలవాటుంది..') -
తెలంగాణ ఎయిమ్స్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
సాక్షి, న్యూ ఢిల్లీ: దేశంలోనే ప్రతిష్టాత్మకమైన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) సేవలు తెలంగాణలో త్వరలో ప్రారంభం కానున్నాయి. భువనగిరి జిల్లా బీబీనగర్‌లో ఎయిమ్స్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన స్థలానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఆమోదం తెలిపారు. దీంతో నిమ్స్ కోసం ఏర్పాటు చేసిన భవణాల్లోనే ఎయిమ్స్ ప్రారంభం కానుంది. ఇప్పటికే భవణాలు సిద్దంగా ఉన్నందున వైద్య సేవలు అతిత్వరలోనే ప్రారంభం చేస్తామని కేంద్ర అధికారులు తెలిపారు. బీబీనగర్‌లో మరో 49 ఎకరాల స్థలంతో పాటు, రోడ్లు, విద్యుత్ వంటి పలు సదుపాయాలు ఏర్పాటు చేయాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. పోరాడి సాధించాం.. భువనగిరి జిల్లాలో ఎయిమ్స్ ఏర్పాటును పోరాడి సాధించామని టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు. ఎయిమ్స్ ఏర్పాటుకు స్థల రూపంలో తొలి అడుగుపడడం సంతోషంగా ఉందని.. ఏడాది లోపు ప్రిలిమినరీ సేవలు ప్రారంభమయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీ తెలిపారు. కేంద్రానికి ధన్యవాదాలు.. టీఆర్ఎస్ ప్రభుత్వ కృషితోనే ఎయిమ్స్ ఏర్పాటు జరగనుందని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సి. లక్ష్మారెడ్డి వివరించారు. ప్రతిష్టాత్మక వైద్య సేవలు రావడానికి సీఎం కేసీఆర్ విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ఎయిమ్స్ ఏర్పాటుకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, అధికారులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రత్యామ్నాయ చికిత్సలపై దృష్టి పెట్టాలి
ప్రివెంటివ్ మెడిసిన్‌పై అవగాహన పెంచాలి ఫిజీషియన్స్ సదస్సులో మంత్రి సి.లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం చేకూర్చేందుకు ప్రత్యామ్నాయ చికిత్స విధానంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని వైద్య, ఆరోగ్య మంత్రి సి.లక్ష్మారెడ్డి అన్నారు. అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆధ్వ ర్యంలో రెండు రోజులపాటు జరుగుతున్న టీఎస్ అపికాన్ (టీఎస్‌ఏపీఐసీవోఎన్)–2017 సదస్సులో మంత్రి ప్రసంగించారు. భారతీయ సంస్కృతి, సంప్ర దాయాలలో భాగంగా అనేక వైద్య చికిత్స విధానాలు పరంపరగా వస్తున్నాయని అన్నారు. వాటిలో దేనికదే ప్రత్యేకత సంతరించుకున్నాయని చెప్పారు. అన్నీ గొప్ప వైద్య విధానాలే అయినప్పటికీ, ఏ ఒక్క వైద్య విధానమో ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం చేకూర్చలేకపోతోందని అన్నారు. ఈ నేపథ్యంలో వైద్యులు ప్రత్యామ్నాయ విధానాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రపంచం మొత్తం యోగాపై దృష్టి సారించిందని, మానసిక ధృఢత్వానికి, రోగ నిరోధక శక్తిని పెంచడం వంటి పలు అంశాల్లో యోగా బాగా పని చేస్తున్నదని వైద్యులే చెబుతున్నారని అన్నారు. వైద్యులు బాధ్యతగా పనిచేసి, మెరుగైన వైద్య సేవలు అందించి ప్రభుత్వానికి మంచిపేరు తేవాలని మంత్రి లక్ష్మారెడ్డి కోరారు. ఇండియన్ ఫిజీషియన్స్ అసోసి యేషన్ ప్రతినిధులు నర్సింహులు, బి.ఆర్.బన్సోడ్, విజయమోహన్, శంకర్ కంపా, మనోహర్, రాజారావు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాల ఏర్పాటు సాహసోపేతం: లక్ష్మారెడ్డి
⇒ జిల్లాల పునర్విభజనతో నూతన శకం ⇒ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి జడ్చర్ల : జిల్లాల పునర్విభజనతో రాష్ట్రంలో నూతన శకం మొదలైందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పత్తి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ అందరి అభిప్రాయాలకనుగుణంగా జిల్లాలను ఏర్పాటు చేయడం సాహసోపేతం అని కొనియాడారు. ఎక్కడా రాజకీయాలకు తావివ్వకుండా, ప్రజల సౌకర్యార్థం జిల్లాలను ఏర్పాటు చేశారన్నారు. దీంతో ప్రజలకు మరింత దగ్గరగా పాలన అందుతుందని చెప్పారు. ప్రజలకు ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ పథకాలు సులువుగా అందుతాయన్నారు. సత్వరమే అధికారులు సమస్యల పట్ల స్పందించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. కొందరు విపక్ష నాయకులు పునర్విభజనను రాజకీయం చేయడం తగదని సూచించారు. జడ్చర్లను జిల్లా చేయాలని విపక్ష నాయకులు డిమాండ్ చేయడం హాస్యాస్పదమన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని మంత్రి లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తంచేశారు.