స్వీపింగ్ మిషన్ ప్రారంభిస్తున్న మంత్రులు మంత్రులు లక్ష్మారెడ్డి, ఈటల రాజేందర్
కరీంనగర్‌కార్పొరేషన్ : కరీంనగర్ నగరపాలక సంస్థలో నూతనంగా కొనుగోలు చేసిన స్వీపింగ్ మిషన్‌ను సోమవారం కోర్టు చౌరస్తాలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్మార్ట్‌సిటీ హోదా దక్కించుకున్న కరీంనగర్ పరిశుభ్రంగా ఉండేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని తెలిపారు. ఈ క్రమంలోనే నగరానికి స్వీపింగ్ మిషన్లు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు.
స్వీపింగ్ మిషన్లు కొనుగోలు చేయడం ద్వారా నైట్ స్వీపింగ్ కార్మికులకు భారం తగ్గుతుందని, ప్రధాన రహదారుల్లో ప్రమాదాలను నియంత్రించొచ్చని పేర్కొన్నారు. రహదారులు పరిశుభ్రంగా ఉంటే నగరం సుందరంగా మారుతుందని, ప్రతి ఒక్కరూ సుందర నగరం కోసం సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, మేయర్ రవీందర్‌సింగ్, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, నగరపాలక సంస్థ కమిషనర్ శశాంక, మున్సిపల్ అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు ప్రారంభం
నగరంలోని 35వ డివిజన్ సప్తగిరికాలనీలో ముఖ్యమంత్రి ప్రత్యేక నిధుల నుంచి చేపట్టనున్న రూ.2.4కోట్ల అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత చిన్న సుందర నగరంగా కరీంనగర్‌కు గుర్తింపు ఉందని, కరీంనగర్‌ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్, కార్పొరేటర్ కవితబుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment