ఆదిలాబాద్ (ఆసిఫాబాద్): ఆసిఫాబాద్ మండల కేంద్రంలో యాభై పడకల ఆసుపత్రి నిర్మాణానికి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మా రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ ఆసుపత్రిని రూ.11 కోట్లతో నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. మంత్రితో పలువురు జిల్లా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.