![Lakshma Reddy signed the organ donation paper - Sakshi](/styles/webp/s3/article_images/2019/02/4/laxmi.jpg.webp?itok=qSXOdaOS)
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్యశాఖ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. అవయవదానం చేస్తానని ప్రతిజ్ఞ చేసి సంబంధిత పత్రాలపై సంతకాలు చేశారు. మరికొందరు అవయవదానం చేయాలని కూడా ఆయన ప్రోత్సహించడం విశేషం. ఆదివారం లక్ష్మారెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాదేపల్లి పట్టణంలో మెగా రక్తదాన శిబి రం నిర్వహించినట్లు తెలిపారు. 15 ఏళ్లుగా తన పుట్టినరోజున శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పా రు. గతంలో 1,220 యూనిట్ల రక్త సేకరణ రికార్డుగా ఉండగా, ఈ ఏడాది 2,120 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment