బాలల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక కృషి
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి
హైదరాబాద్: జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా 94 లక్షల మంది పిల్లలకు నివారణ మందులు పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కె.లక్ష్మారెడ్డి తెలిపారు. చిన్నారుల్లో శారీరక బలహీనతను అరికట్టడానికి ప్రత్యేక కార్యాచరణ చేపడు తున్నట్లు వెల్లడించారు. గురువారం ఇక్కడ అంబర్‌పేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థు లకు నులిపురుగుల నివారణ మందుబిళ్లలను అందించారు. నులిపురుగుల నివారణపై అవ గాహన పోస్టర్‌లను, క్యాలెండర్‌లను ఎమ్మె ల్యే కిషన్‌రెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్ లలితా కుమారితో కలసి మంత్రి ఆవిష్కరించారు.
మంత్రి మాట్లాడుతూ త్వరలో ఆర్‌బీఎస్‌కె (రాష్ట్రీయ బాల వికాస కార్యక్రమం)తో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడిం చారు. పుట్టుకతో వచ్చే వ్యాధులను విద్యా ర్థుల జనన ధ్రువీకరణపత్రం ఆధారంగా గుర్తించి బాలల వికాసానికి కృషి చేస్తామ న్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మోడ్రన్ ఆస్పత్రులుగా తీర్చిదిద్దుతామన్నారు. త్వరలో ప్రా«థమిక ఆరోగ్యకేంద్రం స్థాయిని బట్టి డయాగ్నోస్టిక్ సెంటర్‌నూ ఏర్పాటు చేస్తామన్నారు. నిలో ఫర్, గాంధీ ఆస్పత్రుల ఘటనలపై మంత్రిని ప్రశ్నించగా పరిశీలిస్తామన్నారు.
నేడు నివారణ మాత్రల పంపిణీ
నులిపురుగుల నివారణ కోసం శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా మాత్రలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఏడాది నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న వారందరికీ ఈ మాత్రలను అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలో పంపిణీ చేసేందుకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేసింది.