104కు కొత్త వాహనాలు: లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: 104 ఉద్యోగులు తమ సమస్యలు అడగక ముందే వారి జీతాలను రెట్టింపు చేసిన ఘనత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని తెలంగాణ సర్కారుదే అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం మంత్రి లక్ష్మారెడ్డికి తెలంగాణ భవన్‌లో 104 ఉద్యోగులు సన్మానం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.36 వేల కోట్లతో అనేక పథకాలు చేపట్టిందని మంత్రి చెప్పారు. ఆరోగ్య తెలంగాణని సాధించే దిశగా సీఎం కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖకు ప్రాధాన్యమిస్తున్నా రన్నారు. ఒక్క ఏడాదిలోనే ప్రభుత్వ వైద్యశాలల్లో 20 శాతం ఓపీ పెరిగిం దన్నారు. 104 సేవలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 104కి కొత్త వాహనాలను త్వరలోనే అందించనున్నామని చెప్పారు. కాగా, 104 ఉద్యోగుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేసింది మంత్రి లక్ష్మారెడ్డియేనని మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. 104 ఉద్యోగులకు కూడా సానుకూల నిర్ణయమే ఉంటుందన్న అభిప్రాయాన్ని పల్లా వ్యక్తం చేశారు.