స్టెంట్ల ధరలు తగ్గినా... పేదలను పీడిస్తూనే ఉన్నారు
⇒ ప్రైవేట్ ఆసుపత్రులను అదుపుచేయటంలో విఫలం
⇒ ప్రభుత్వం తీరును ఎండగట్టిన కాంగ్రెస్ సభ్యులు
⇒ ధరలు పెంచి అమ్మితే చర్యలు తప్పవన్న మంత్రి లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా హృద్రో గంతో చనిపోతున్న వారిలో తెలంగాణ ప్రాంత వాసుల సంఖ్యనే అధికంగా ఉన్నందున ప్రజ లకు తక్కువ ధరలకే స్టెంట్లు అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ శాసనసభలో డిమాండ్ చేసింది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ నిర్ధారించిన ధరలకే స్టెంట్లు అందుబాటులో ఉండేలా చూడాలని, రాష్ట్రంలో ప్రతి నెలా ఏడు వేల స్టెంట్లు అవసరమవుతున్నందున స్థాని కంగా ప్రభుత్వమే నాణ్యమైన స్టెంట్లు తయారు చేసేందుకు యూనిట్‌ను ఏర్పాటు చేసే విషయాన్ని ఆలోచించాలని కోరింది. కేంద్రం స్టెంట్ల ధరలను నిర్ధారించిందని..
కానీ ప్రైవేట్ ఆస్పత్రుల్లో వాటిని అధిక ధరలకు విక్రయిస్తు న్నా ప్రభుత్వం నిలవరించ లేకపో తోందని ఆరోపించింది. బుధవారం శాసన సభలో కాంగ్రెస్ సభ్యులు జీవన్‌రెడ్డి, చిన్నా రెడ్డి, సంపత్ ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్రం ధర లు తగ్గించినా దాన్ని అమలు చేయకపోవటం దారుణమన్నారు. వైద్య శాఖ మంత్రి నిమ్స్‌ను వెంటనే తనిఖీ చేయాలన్నారు. స్టెంట్ అవసర మో కాదో తేల్చేందుకు పరీక్షలు అందుబా టులో ఉన్నప్పటికీ చాలా ఆసుపత్రుల్లో రోగి రాగానే నేరుగా స్టెంట్ వేయాలని డాక్టర్లు చెప్తున్నారని, ప్రాణభయంతో పేదలు ఆస్తులు అమ్మి స్టెంట్లు కొనాల్సి వస్తోందని అధికార పార్టీ సభ్యుడు శ్రీనివాసగౌడ్ పేర్కొన్నారు.
నిర్ధారిత ధరలకే స్టెంట్లు: లక్ష్మారెడ్డి
నేషనల్ ఫార్మస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ మందు పూత ఉన్న స్టెంట్ ధరను రూ.29,600గా, పూత లేని స్టెంట్ ధర రూ.7,260గా నిర్ధారించిందని, ఆ ధరలకే వాటిని అమ్మాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఈ ధరలకు అమ్మలేక కొన్ని కంపెనీలు మార్కెట్లోని స్టెంట్లను వెనక్కు తీసుకుం టున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, దీనిపై చర్చిస్తున్నట్టు పేర్కొన్నారు. కేంద్ర క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్టును అడాప్ట్ చేసుకుని రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పారు. ఇందుకు ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించి పర్యవేక్షి స్తామన్నారు. అనవసర శస్త్రచికిత్సలు చేసే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నా మన్నారు. ఇటీవలే అలాంటి 8 ఆసుపత్రులపై చర్యలు తీసుకు న్నామని చెప్పారు. నిమ్స్‌లో కొత్తగా 109 వెంటిలేటర్లు, 54 వరకు బెడ్లు సమకూర్చా మన్నారు. నిమ్స్ తరహాలో మరిన్ని ఆసుపత్రులు నిర్మించే యోచనలో ఉన్నట్టు వెల్లడించారు.