
26న తమిళనాడుకు కేబినెట్ ఉపసంఘం
సాక్షి, హైదరాబాద్: వైద్య రంగంలో తీసుకురావాల్సిన మార్పులు చేర్పులపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఈ నెల 26, 27 తేదీల్లో తమిళనాడులో పర్యటించనుంది. మంత్రివర్గ ఉపసంఘంలోని మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ తదితరులు ఆ రాష్ట్రంలో పర్యటించి అక్కడి ఉన్నతాధికారులతో చర్చిస్తారు. రెండు నెలల క్రితమే ఉపసంఘం తమిళనాడులో పర్యటించాల్సి ఉండగా అక్కడ భారీ వరదల కారణంగా వాయిదా పడి ంది. తమిళనాడులో వైద్య ఆరోగ్య సేవలు ఆదర్శంగా ఉన్నాయని భావించిన మంత్రులు అక్కడ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అధ్యయనం చేస్తారు. వివిధ ఆసుపత్రులను సందర్శిస్తారు.