ఆసుపత్రుల్లో ఖాళీలు భర్తీ చేస్తాం: లక్ష్మారెడ్డి
హైదరాబాద్: రానున్న రోజుల్లో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరిస్తావుని వైద్య ఆరోగ్య శాఖ వుంత్రి సి.లక్ష్మారెడ్డి తెలిపారు. అలాగే ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న అన్ని రకాల ఉద్యోగాలనూ భర్తీ చేస్తామన్నారు. బుధవారం ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘తమిళనాడు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందుతోంది. మన రాష్ట్రంలో కూడా త్వరలో ఆ స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి తెస్తాం.
అంతేకాకుండా ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలను ఆరోగ్యశ్రీలో చేర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. హైదరాబాద్ నలువైపులా ఆధునిక వసతులతో ప్రభుత్వ ఆసుపత్రులను నిర్మిస్తాం. చరిత్రాత్మక ఉస్మానియా భవనాన్ని కూల్చివేయకుండా సమీపంలోనే నూతనంగా బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి అందులో దవాఖానా అందుబాటులోకి తెస్తాం’ అని మంత్రి చెప్పారు. ఆసుపత్రిలో ఇటీవల అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకున్న ఇద్దరు పేషెంట్లు మహేష్, రమేష్‌లను మంత్రి పరామర్శించారు.