• అతికష్టం మీద జనరల్ వార్డుకు తీసుకొచ్చాం: మంత్రి లక్ష్మారెడ్డి
• సరైన సమాధానం రాలేదంటూ మండలి నుంచి కాంగ్రెస్ వాకౌట్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లో ఆరోగ్య శాఖను ఐసీయూలోకి పంపించా రని, టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక అతి కష్టం మీద ఇప్పుడిప్పుడే జనరల్ వార్డుకు తీసు కొచ్చామని ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. పదేళ్లుగా డాక్టర్లు, సిబ్బంది పోస్టులు భర్తీ జరగలేదని.. 2,118 డాక్టర్, ఇతర పోస్టుల భర్తీ కావాల్సి ఉందన్నారు. శనివారం మండలి లో ప్రశ్నోత్తరాల సమయంలో ఆరోగ్య శాఖే పేషెంట్ అయిందన్న పొంగులేటి సుధాకర్‌రెడ్డి వాఖ్యలకు మంత్రి ఘాటుగా స్పందించారు. విష జ్వరాలు, సరైన చికిత్స అందక సంభవి స్తున్న మరణాల నియంత్రణకు చర్యలపై కౌన్సిల్‌లో విపక్ష నేత షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రంగారెడ్డి, ఆకుల లలిత అడిగిన ప్రశ్నపై మంత్రి సమాధానమిస్తూ.. 2015లో 1,831 డెంగీ కేసులు గుర్తించగా, 2016లో 2,725 కేసులను గుర్తించామని.. ముమ్మర నిఘా వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు.
మం త్రి సమాధానం నిరాశ కలిగించిందంటూ కాం గ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా కొత్త పరికరాల కోసం రూ.30 కోట్లు ఖర్చు చేసినట్లు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వెల్లడించారు. సైబర్ విధానంపై ఐటీ మంత్రి కేటీఆర్‌తో సభ్యులకు సమావేశాన్ని ఏర్పాటు చేసి అనుమానాలు నివృత్తి చేస్తామని పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చారు. చారిత్రక దేవాలయాల పునర్‌నిర్మాణానికి చర్యలు తీసు కుంటున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్‌రెడ్డి తెలిపారు. నూరు శాతం సబ్సిడీపై చేప పిల్లల సరఫరాకు రూ.104 కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు పశుసంవర్థక మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు.