
ఆరోగ్య శాఖే పెద్ద రోగి: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మరణమృదంగం మోగుతున్నదని, అయినా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి లక్ష్మారెడ్డి కళ్లు మూసుకుంటున్నారని శాసన మండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ ఆవరణలో ఆదివారం ఆయన విలేక రులతో మాట్లాడుతూ ఆరోగ్యశాఖ రాష్ట్రంలో పెద్ద రోగిగా మారిందన్నారు.
ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ ఘటనలపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రుల్లో నిర్లక్ష్యం, కల్తీ మందులతో రోగుల ప్రాణాలు పోవడానికి కారణమైనవారిపై కేసులు పెట్టి, జైళ్లలో వేయాలని కోరారు.