
108 ఉద్యోగులకు ఉగాది కానుక
రూ.4 వేల చొప్పున జీతాల పెంపు: లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న 108 ఉద్యోగులందరికీ రూ.4 వేల చొప్పున వేతనాలు పెంచారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పెంపు 2016 ఏప్రిల్ నుంచి వర్తిం పచేస్తున్నట్లు చెప్పారు. పెంపు మొత్తాన్ని విడుదల చేశామన్నా రు. దీంతో 1,578 మందికి లబ్ధి చేకూరుతుందని, వివిధ కేడర్లకు చెందిన వారి వేతనాలు రూ. 19 వేలు కానున్నాయని మంత్రి వివరించారు.