పాలియేటివ్ కేంద్రంలో ఉద్యోగులతో మాట్లాడుతున్న మంత్రి లక్ష్మారెడ్డి
పాలమూరు : మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన క్యాన్సర్ పాలియేటివ్ కేంద్రం ద్వారా రోగులకు మె రుగైన చికిత్స అందుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వె ల్లడించారు. జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ఏడు పడకల క్యాన్సర్ పాలియేటివ్ కేంద్రాన్ని సోమవారం ఆయన ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడు, కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ దేశంలోనే రెండో పాలియేటివ్ కేంద్రం ఇక్కడ ప్రారంభించినట్లు తెలిపారు.
అత్యంత ఆధునిక సదుపాయాలు ఈ కేంద్రంలో ఉంటాయన్నారు. ఈ కేంద్రం ద్వారా క్యాన్సర్ తో బాధపడుతూ చివరి దశలో ఉన్న రోగులకు అండగా ఉంటూ అవసరమైన వైద్యం లభిస్తుందని తెలిపారు. త్వరలో జనరల్ ఆస్పత్రి వెనుక భాగం గా పాలియేటివ్ కేంద్రానికి శాశ్వత భవనం నిర్మించడంతో పాటు పది పడకలకు పెంచనున్నట్లు పేర్కొన్నారు. కాగా, జిల్లాలోని ఆస్పత్రుల్లో ఆధునిక సౌకర్యాలతో కూడిన లేబర్ రూంలు ఏర్పాటుచేసి, గర్భిణులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా ఎరుగైన వైద్యం అందజేస్తున్నామని తెలిపారు. జనరల్ ఆస్పత్రిలో ఉన్న ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు.
ఇక్కడే నిపుణులు
ఉమ్మడి జిల్లా నుంచి ఎవరు కూడా వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడి ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిపుణులను నియమించి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జిల్లాకు మెడికల్ కళాశాల వచ్చిన తర్వాత నిపుణులైన వైద్యులు అందుబాటులోకి వచ్చారని.. దీంతో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. ఇప్పుడు ఉన్న ఆస్పత్రి సరిపోవడం లేదనందున పక్కనే ఉన్న స్థలంలో మరో భవన నిర్మాణానికి కూడా శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రాధ, డీఎంహెచ్‌ఓ రజని, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్, డాక్టర్ మీనాక్షి, మల్లికార్జున్, మాస్ మీడియా అధికారి వేణుగోపాల్‌రెడ్డి, సునీల్, శ్రీనివాసరాజు, డాక్టర్ రాధ, చక్రధర్‌గౌడ్, పరంజ్యోతి, సునందిని, సత్యనారాయణరెడ్డి, భీంరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, డాక్టర్ జీవన్, అధికారులు పాల్గొన్నారు.
45మంది ఏఎన్‌ఎంలకు వాహనాలు
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యాన అమలవుతున్న ‘ప్రాజెక్టు రెక్కలు’ పథకంలో భాగంగా 45మంది ఏఎన్‌ఎంలకు ద్విచక్ర వాహనాలను మంత్రి లక్ష్మారెడ్డితో పాటు ఎమ్మెల్యే, కలెక్టర్ అందజేశారు. నర్మద హోండ, అశ్విని హీరో షోరూం నుంచి ఏఎన్‌ఎంలకు వాటిని అందజేశారు. జిల్లాలో మొత్తం 270మంది ఏఎన్‌ఎంలకు మొదటి విడతలో 45మందికి వాహనాలు ఇచ్చారు. ఆనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ వాహనాల ద్వారా ఏఎన్‌ఎంలు క్షేత్రస్థాయిలో పర్యటించి వైద్యం అందించడానికి సలువుగా ఉంటుందన్నారు. ఎన్‌హెచ్‌ఎం కింద రూ.10వేలు, కలెక్టర్ నిధుల కింద రూ.5వేలు, షోరూం వాళ్లు రూ.3వేలు తగ్గింపు చేసి ఇస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment