MLA Srinivas Gowd
-
పాలమూరులో మినీ శిల్పారామం
పాలమూరు: పాలమూరు పట్టణం పర్యాటకులను ఆకట్టుకోవడానికి మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే స్థానికంగా కొన్ని ఆహ్లాదకరమైన ప్రాంతాలు ఏర్పాటు కాగా అదే తరహాలో మరో నూతన పార్క్‌ను ఏర్పాటు చేయడానికి కసరత్తు జరుగుతుంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహబూబ్‌నగర్ పట్టణంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రధానంగా మయూరి పార్క్, మినీ ట్యాంక్‌బండ్, మోడ్రన్ రైతుబజార్ వంటి కార్యక్రమాలకు శ్రీకారం చూట్టారు. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్ ప్టణానికి మినీ శిల్పారామం ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెం.53ను శుక్రవారం విడుదల చేసింది. ఈ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.8కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అన్ని హంగులతో.. హైదరాబాద్‌లోని శిల్పారామానికి ఏమాత్రం తీసిపోని విధంగా మహబూబ్‌నగర్ పట్టణంలో ఏర్పాటు చేసే మినీ శిల్పారా మం ఉండనుంది. అదే నమూనాను తీసుకొని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అక్కడ ఉన్న వాటితో పాటు మరికొన్ని అదనంగా ఏర్పాటు చేయడానికి ప్రణాళిక తయారు చేస్తున్నారు. ప్రధాన ముఖ ద్వారం, పచ్చిక బయళ్లు, ఫౌంటెన్లు, రకరకాల మొక్కలు, చిన్నపిల్లల కోసం ప్రత్యేక ఆటస్థలం, పెద్దలు సేదతీరడం కోసం పార్కు, వాకింగ్ ట్రాక్స్‌ను, వివిధ రకాల వంటకాలతో ఫుడ్కోర్ట్, సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం, సమావేశాల కోసం కాన్ఫరెన్స్‌హాల్, ఫంక్షన్‌హాల్, చేనేత, హస్తకళల స్టాల్స్, పల్లెదనం ఉట్టిపడేలా గ్రామీణ వాతావరణంలో ఉండే ఎద్దుల బొమ్మలు, రైతుల బొమ్మలు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణ నడిబొడ్డున మినీ ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్‌కు అనుకోని పట్టణ ప్రజలు పల్లెలో ఉండే వాతావరణాన్ని ఆహ్లాదించే విధంగా ఈ శిల్పారామాన్ని ఏర్పాటుచేయనున్నారు. మహబూబ్‌నగర్ పట్టణానికి మినీ శిల్పారామాన్ని మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి మహబూబ్‌నగర్ పట్టణ ప్రజల తరఫున మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. మహబూబ్‌నగర్‌కి ప్రత్యేక ఆకర్షణగా మినీ శిల్పారామాన్ని రూపొందిస్తామని తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేయబోయే మినీ శిల్పారామం పట్టణం మధ్యలో ఉండటం వల్ల పట్టణంతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కూడా మినీ శిల్పరామం సందర్శించే అవకాశం ఉంది. అన్ని ప్రాంతాల ప్రజలకు అనువైన స్థలంలో దీనిని నిర్మాణం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మినీ ట్యాంక్‌బండ్‌కు సమీపంలో దీనిని ఏర్పాటు చేయడానికి ఇప్పటికే అవసరమైన ప్రణాళిక తయారు చేయడం జరిగింది. హైదరాబాద్‌లో ఉన్న శిల్పారామం నమూన పద్ధతిలో మినీ శిల్పారామంగా ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతుంది. మహబూబ్‌నగర్‌ను ఒక టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దడానికి ఎలాంటి అభివృద్ధి పనులకు అయిన శ్రీకారం చుట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే మంత్రి ప్రకటించారు. దీంతో పర్యాటకులు రెండు రోజుల పాటు పాలమూరులో బస చేసే విధంగా ఆలయాలు, పార్క్‌లను నిర్మాణం కానున్నాయి. ఇప్పటికే మయారీ పార్క్ సుందరంగా తీర్చిదిద్దారు. అదేవిధంగా ఇటీవల పిల్లల మర్రిలో మ్యూజియం ప్రారంభం చేసి దాంట్లో ఎంతో విలువైన సంపదను భద్రపరిచారు. దీంతో పాటు ట్యాంక్ బండ్ సమీపంలో నెక్లెస్ రోడ్ ఏర్పాటుకు కూడా శ్రీకారం చుడుతున్నారు. -
రెండేళ్లలో పుష్కలంగా సాగునీరు
మహబూబ్‌నగర్ రూరల్: పాలమూరు ఎత్తిపోతల పథకం అమలులో భాగంగా నిర్మిస్తున్న కర్వెన రిజర్వాయర్ ద్వారా రాబోయే రెండేళ్లలో మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సాగునీటిని అందిస్తామని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ప్రస్తుతం కర్వెన రిజర్వాయర్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, రిజర్వాయర్ నిర్మాణాన్ని త్వరతగతిన పూర్తి చేసి రిజర్వాయర్ నీటితో గ్రామాలలోని చెరువులను నింపుతామన్నారు. బుధవారం మండలంలోని ధర్మాపూర్, కోటకదిర గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించి సుమారు రూ.1.68 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ధర్మాపూర్ గ్రామంలో అంగన్వాడీ భవనం, ముదిరాజ్ కమ్యూనిటీ హాల్, అదనపు తరగతి గదులు, మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించారు. కోటకదిర గ్రామంలో రూ.16 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయంతో పాటు అంగన్వాడీ భవనం, అదనపు తరగతి గదులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా నెల రోజుల్లో ఇంటింటికి శుద్ధ జలాలను అందిస్తామని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా కృష్ణా జలాలను ఇంటింటికి నల్లాల ద్వారా అందించేందుకు అవసరమైన పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, పనులన్ని నిర్ణీత సమయంలో కొనసాగడం వల్ల అనుకున్న సమయానికి తాగునీటిని అందిస్తామని తెలిపారు. ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి బంగారు తెలంగాణ సాధనే ధ్యేయంగా సీఎం కేసీఆర్ శ్రమిస్తున్నారని, ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. కల్యాణలక్ష్మి పథకం సొమ్ము పెంపుతో పాటు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలు ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నాయని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరనప్పటికినీ తెలంగాణ ఏర్పడిన అనంతరం అన్ని రంగాల్లో అభివృద్ధి ఉరకలేస్తుందని అన్నారు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా వ్యవసాయానికి పెద్దపీట వేసిందని, రైతుబంధు పథకం, రైతు కుటుంబానికి రూ. 5 లక్షలు బీమా అందించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ సావిత్రి, జెడ్పీటీసీ సభ్యురాలు వై.శ్రీదేవి, వైస్ ఎంపీపీ మల్లు సరస్వతమ్మ, సర్పంచ్‌లు పసుల వసంత, మల్లు ప్రియాంక, ఎంపీటీసీలు నాగమణి, మల్లు దేవేందర్‌రెడ్డి, ఉప సర్పంచ్ టి.కురుమూర్తి, ఎంపీడీఓ మొగులప్ప, పీఆర్ ఏఈ శ్రీనివాస్‌గౌడ్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ మల్లు నర్సింహారెడ్డి, జిల్లా డైరెక్టర్ మల్లు నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి, నాయకులు వై.శ్రీనివాసులు, వెంకటేష్‌యాదవ్, మాజీ సర్పంచ్ ఆంజనేయులు, పసుల వెంకట్రాములు, యాదయ్య, గూడెం తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. రోడ్డు సమస్యలపై చర్చ పాలమూరు: జిల్లా కేంద్రంలో ఉన్న ప్రధాన రోడ్డుపై బుధవారం హైదరాబాద్‌లోని లాల్మంజిల్ ఆర్అండ్బీ ఈఎన్సీ కార్యాలయంలో జాతీయ రహదారుల సీఈ రవిప్రసాద్, ఎస్ఈ విజయ్‌కుమార్‌ను స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడు కలిశారు. అప్పన్నపల్లి నుంచి పాలమూరు యూనివర్సిటీ వరకు పట్టణంలో వెళ్తున్న ప్రధాన రోడ్డు ఒక్కటే ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వారి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రత్యామ్నాయ రోడ్డు మార్గం లేకపోవడం వల్ల నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయని, ఈ విషయంపై అనేకసార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. టెండర్లు పూర్తి చేసి ప్రధాన రోడ్డును వెంటనే పూర్తి చేయాలని కోరారు. -
‘పిల్లలమర్రి’కి పూర్వ వైభవం తీసుకొస్తాం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : మహబూబ్‌నగర్ జిల్లాకే తలమానికంగా నిలుస్తున్న పిల్లలమర్రికి పూర్వ వైభవం తీసుకొస్తామని ఎమ్మెల్యే శ్రీని వాస్‌గౌడ్ తెలిపారు. పట్టణంలోని పిల్లలమర్రిని సోమవారం ఆయన సందర్శించారు. మర్రి చెట్టు పరిరక్షణకు చేపడుతున్న చర్యలు తెలుసుకున్న ఆయన మాట్లాడుతూ త్వరలోనే ప్రజల సందర్శనకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంత రం దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశా రు. టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటయ్యతో పాటు తిరుమల వెంకటేశ్, రియాసత్‌ఖాన్, నవీన్‌రాజ్, ఖాద్రీ, చంద్రకాంత్ పాల్గొన్నారు. -
20నుంచి లారీల బంద్
జడ్చర్ల: ఈనెల 20వ తేదీ నుంచి ఆలిండియా లారీల నిరవధిక బంద్ చేపడుతున్నట్లు జడ్చర్ల లారీ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్‌గౌడ్ తెలిపారు. ఈమేరకు బంద్ పోస్టర్లను శనివారం హైద రాబాద్ ప్రెస్‌క్లబ్‌లో లారీ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి విడుదల చేశారు. డీజిల్ ధరలు జీఎస్టీ పరిధిలోకి తేవాలని, దేశ వ్యాప్తంగా ఒకే ధర నిర్ణయించి మూడు నెలలకోసారి సవరించా లని డిమాండ్ చేశారు. అదేవిధంగా టోల్గేట్లు తొలగించాలని, పెంచిన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించాలని, లారీ యజమానుల నుంచి టీడీఎస్ వసూలు చేయొద్దన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సింగిల్ పర్మిట్ విధానం అమలుచేయాలని, ప్రమాదం లేదా ఓవర్‌లోడ్ విషయంలో డ్రైవర్ లైసెన్స్ రద్దు విధానాన్ని విర మించుకోవాలని కోరారు. ఇంకా జిల్లాకో డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేయాలని, విద్యార్హతతో సంబం ధం లేకుండా లైసెన్స్‌లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, 2015 జూన్‌లో సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించే వరకు బంద్ కొనసాగిస్తామన్నారు. అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కుమార్‌గౌడ్, కార్యదర్శి వహీద్, శ్రీనువాసులు, శ్రీనివాస్‌గౌడ్, సుల్తాన్, రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
రైతుల అభ్యున్నతికే ‘రైతు బంధు’
మహబూబ్‌నగర్ రూరల్ : తెలంగాణ రాష్ట్రంలో రైతుల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం అర్బన్ మండలంలోని ఏనుగొండ రెవెన్యూ గ్రామంలో రైతుబంధు పథకం చెక్కులను రైతులకు అందజేసి మాట్లాడారు. రాష్ట్రంలోని రైతులు అప్పులపాలు కాకుండా వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందజేస్తుందని తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుల శ్రేయస్సుకు ఎకరానికి రూ.4వేలు సాయం అందిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భూ సర్వే చేసి రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తుందని అన్నారు. రైతులు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని, సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వా త సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ సాధనకు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ మహాయజ్ఞంలో భాగంగానే రైతులకు ఆర్థిక సాయం అందించే విధంగా ప్రతిష్టాత్మకంగా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. రైతుల పేర్లు తప్పొప్పు లు ఉంటే సవరించడానికి వీలుగా ప్రత్యేక అధికా రులను నియమించడం జరిగిందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పెట్టుబడి సాయం పొందాలని కోరారు. కార్యక్రమంలో త హసీల్దార్ ఎంవీ ప్రభాకర్‌రావు, డీటీ కోట్ల మురళీధర్, ఎంఆర్ఐ క్రాంతికుమార్‌గౌడ్, కౌన్సిలర్లు వ నజ, శివశంకర్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ రాములు తదితరులు పాల్గొన్నారు. -
‘రైతుబంధు’ దేశానికే ఆదర్శం
మహబూబ్‌నగర్ రూరల్ : రైతుబంధు పథకం దేశానికే ఆదర్శం అని, ప్రభుత్వం చేపడుతున్న రైతుబంధు పథకంలో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తుందని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ అర్బన్ మండ లం మహాత్మాగాంధీ రోడ్ హైస్కూల్లో రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. అదేవిధంగా రూరల్ మండలంలోని ధర్మాపూర్, మాచన్పల్లిలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై చెక్కులను పంపిణీ చేశారు. మహాత్మాగాంధీ రోడ్ హైస్కూల్లో అర్బన్ మండల తహసీల్దార్ ఎంవీ ప్రభాకర్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రైతులు పెట్టుబడులకు ఇబ్బంది లేకుండా దేశంలో ఏ రాష్ట్రంలో ఏ సీఎం అమలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎకరానికి రూ.4వేల చొప్పున రెండు పంటలకు రూ. 8వేలు ఇస్తున్నారని అన్నారు. ఆంధ్ర మాదిరిగానే ఇక్కడ కూడా రెండు పంటలు పండిస్తామని అన్నారు. అందుకోసం శ్రీశైలం నుంచి ప్రభుత్వం నీళ్లు తెస్తుందని అన్నారు. మండలాల వారీగా నిర్ధేశించిన తేదీల్లో చెక్కులు అందజేస్తారని అన్నారు. ప్రభుత్వం అందించిన సొమ్మును విత్తనాలు, కూలీలకు, పురుగుల మందులు తదితర ఖర్చుల కు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్, వైస్ చైర్మన్ రాములు, ఎంపీపీ సావిత్రి, జెడ్పీటీసీ వై.శ్రీదేవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్, డైరెక్టర్ పి.రవీందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్లు రాజేశ్వర్‌రెడ్డి, వెంకటయ్య, మండల రైతు సమన్వయ సమి తి కన్వీనర్లు మల్లు నర్సింహారెడ్డి, రాములు, తహ సీల్దార్లు ఎంవీ ప్రభాకర్‌రావు, శంకర్, ఎంపీడీఓ మొగులప్ప, ఏఓలు నాగరాజు, అష్రత్ సుల్తాన, కౌన్సిలర్ పద్మజా గోపాల్‌యాదవ్, సర్పంచ్‌లు పసుల వసంత, విజయ, ఎంపీటీసీలు నాగమణి, కళమ్మ, టీఆర్ఎస్ నాయకులు సుధాకర్‌రెడ్డి, శాంతయ్యయాదవ్, శివరాజ్, వై.శ్రీనివాసులు, వెంకటేష్‌యాదవ్, వెంకట్రాములు, యాదయ్య, గూడెం తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. -
క్యాన్సర్ కేంద్రంతో మెరుగైన సేవలు
పాలమూరు : మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన క్యాన్సర్ పాలియేటివ్ కేంద్రం ద్వారా రోగులకు మె రుగైన చికిత్స అందుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వె ల్లడించారు. జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ఏడు పడకల క్యాన్సర్ పాలియేటివ్ కేంద్రాన్ని సోమవారం ఆయన ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడు, కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ దేశంలోనే రెండో పాలియేటివ్ కేంద్రం ఇక్కడ ప్రారంభించినట్లు తెలిపారు. అత్యంత ఆధునిక సదుపాయాలు ఈ కేంద్రంలో ఉంటాయన్నారు. ఈ కేంద్రం ద్వారా క్యాన్సర్ తో బాధపడుతూ చివరి దశలో ఉన్న రోగులకు అండగా ఉంటూ అవసరమైన వైద్యం లభిస్తుందని తెలిపారు. త్వరలో జనరల్ ఆస్పత్రి వెనుక భాగం గా పాలియేటివ్ కేంద్రానికి శాశ్వత భవనం నిర్మించడంతో పాటు పది పడకలకు పెంచనున్నట్లు పేర్కొన్నారు. కాగా, జిల్లాలోని ఆస్పత్రుల్లో ఆధునిక సౌకర్యాలతో కూడిన లేబర్ రూంలు ఏర్పాటుచేసి, గర్భిణులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా ఎరుగైన వైద్యం అందజేస్తున్నామని తెలిపారు. జనరల్ ఆస్పత్రిలో ఉన్న ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. ఇక్కడే నిపుణులు ఉమ్మడి జిల్లా నుంచి ఎవరు కూడా వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడి ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిపుణులను నియమించి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జిల్లాకు మెడికల్ కళాశాల వచ్చిన తర్వాత నిపుణులైన వైద్యులు అందుబాటులోకి వచ్చారని.. దీంతో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. ఇప్పుడు ఉన్న ఆస్పత్రి సరిపోవడం లేదనందున పక్కనే ఉన్న స్థలంలో మరో భవన నిర్మాణానికి కూడా శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాధ, డీఎంహెచ్ఓ రజని, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్, డాక్టర్ మీనాక్షి, మల్లికార్జున్, మాస్ మీడియా అధికారి వేణుగోపాల్‌రెడ్డి, సునీల్, శ్రీనివాసరాజు, డాక్టర్ రాధ, చక్రధర్‌గౌడ్, పరంజ్యోతి, సునందిని, సత్యనారాయణరెడ్డి, భీంరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, డాక్టర్ జీవన్, అధికారులు పాల్గొన్నారు. 45మంది ఏఎన్ఎంలకు వాహనాలు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యాన అమలవుతున్న ‘ప్రాజెక్టు రెక్కలు’ పథకంలో భాగంగా 45మంది ఏఎన్ఎంలకు ద్విచక్ర వాహనాలను మంత్రి లక్ష్మారెడ్డితో పాటు ఎమ్మెల్యే, కలెక్టర్ అందజేశారు. నర్మద హోండ, అశ్విని హీరో షోరూం నుంచి ఏఎన్ఎంలకు వాటిని అందజేశారు. జిల్లాలో మొత్తం 270మంది ఏఎన్ఎంలకు మొదటి విడతలో 45మందికి వాహనాలు ఇచ్చారు. ఆనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ వాహనాల ద్వారా ఏఎన్ఎంలు క్షేత్రస్థాయిలో పర్యటించి వైద్యం అందించడానికి సలువుగా ఉంటుందన్నారు. ఎన్హెచ్ఎం కింద రూ.10వేలు, కలెక్టర్ నిధుల కింద రూ.5వేలు, షోరూం వాళ్లు రూ.3వేలు తగ్గింపు చేసి ఇస్తున్నట్లు తెలిపారు. -
కాంగ్రెస్ గుండా గిరికి ఇది నిదర్శనం
సాక్షి, హైదరాబాద్ : బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే కాంగ్రెస్ పార్టీ సభలో గూండాగిరికి దిగిందని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రథమ పౌరుడైన గవర్నర్ పై హెడ్‌ఫోన్స్ విసరడం ఏమిటని ప్రశ్నించారు. కళ్ళు పోతే బాధ్యులు ఎవరని మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. సభలో ప్రవర్తించిన తీరును చూసి ఎవరు హీరోలు కాలేరని జీరోలు మాత్రమే అవుతారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే రేపు మాట్లాడొచ్చని సవాల్ చేశారు. గవర్నర్ ప్రసంగంపై మాట్లాడేందుకు రేపు సమయాన్ని కేటాయిస్తామన్నారు. వారు కావాలనే గొడవకు దిగి బయటకు పోవాలని ఈ ప్లాన్ చేశారని ఆరోపించారు. దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బీహార్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించినట్లు ఇక్కడ ప్రవర్తిస్తే కుదరదని, ఇది తెలంగాణ అని కాంగ్రెస్ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. -
‘హోంగార్డులను క్రమబద్ధీకరించండి’
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు హోంగార్డులను క్రమబద్ధీకరించాలని హోంగార్డ్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో హోం శాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేదితో భేటీ అయి హోం గార్డ్స్ సమస్యలపై చర్చించారు. శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ హోంగార్డ్స్కు స్పెషల్ పోలీస్ అసిస్టెంట్ పోస్ట్‌ను ఏర్పాటు చేసి, పే స్కేల్, ఉద్యోగ, ఆరోగ్య భద్రత, అలవెన్స్, డ్రెస్సులు ఇవ్వాలని కోరారు. దీని పై పలుమార్లు డీజీపీ, హోం కార్యదర్శికి విన్నవించామన్నారు. డిమాండ్లపై హోం కార్యదర్శి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో హోం గార్డ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేందర్, ప్రధాన కార్యదర్శి కుమారస్వామి, దయానంద్ పాల్గొన్నారు.