మాట్లాడుతున్న ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్ రూరల్ : రైతుబంధు పథకం దేశానికే ఆదర్శం అని, ప్రభుత్వం చేపడుతున్న రైతుబంధు పథకంలో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తుందని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ అర్బన్ మండ లం మహాత్మాగాంధీ రోడ్ హైస్కూల్‌లో రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. అదేవిధంగా రూరల్ మండలంలోని ధర్మాపూర్, మాచన్‌పల్లిలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై చెక్కులను పంపిణీ చేశారు. మహాత్మాగాంధీ రోడ్ హైస్కూల్‌లో అర్బన్ మండల తహసీల్దార్ ఎంవీ ప్రభాకర్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.
రైతులు పెట్టుబడులకు ఇబ్బంది లేకుండా దేశంలో ఏ రాష్ట్రంలో ఏ సీఎం అమలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎకరానికి రూ.4వేల చొప్పున రెండు పంటలకు రూ. 8వేలు ఇస్తున్నారని అన్నారు. ఆంధ్ర మాదిరిగానే ఇక్కడ కూడా రెండు పంటలు పండిస్తామని అన్నారు. అందుకోసం శ్రీశైలం నుంచి ప్రభుత్వం నీళ్లు తెస్తుందని అన్నారు. మండలాల వారీగా నిర్ధేశించిన తేదీల్లో చెక్కులు అందజేస్తారని అన్నారు. ప్రభుత్వం అందించిన సొమ్మును విత్తనాలు, కూలీలకు, పురుగుల మందులు తదితర ఖర్చుల కు వినియోగించుకోవాలని కోరారు.
కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ రాధా అమర్, వైస్ చైర్మన్ రాములు, ఎంపీపీ సావిత్రి, జెడ్పీటీసీ వై.శ్రీదేవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్, డైరెక్టర్ పి.రవీందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్లు రాజేశ్వర్‌రెడ్డి, వెంకటయ్య, మండల రైతు సమన్వయ సమి తి కన్వీనర్లు మల్లు నర్సింహారెడ్డి, రాములు, తహ సీల్దార్లు ఎంవీ ప్రభాకర్‌రావు, శంకర్, ఎంపీడీఓ మొగులప్ప, ఏఓలు నాగరాజు, అష్రత్ సుల్తాన, కౌన్సిలర్ పద్మజా గోపాల్‌యాదవ్, సర్పంచ్‌లు పసుల వసంత, విజయ, ఎంపీటీసీలు నాగమణి, కళమ్మ, టీఆర్‌ఎస్ నాయకులు సుధాకర్‌రెడ్డి, శాంతయ్యయాదవ్, శివరాజ్, వై.శ్రీనివాసులు, వెంకటేష్‌యాదవ్, వెంకట్రాములు, యాదయ్య, గూడెం తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment