బంద్ పోస్టర్లు విడుదల చేస్తున్న శ్రీనివాస్‌గౌడ్ తదితరులు
జడ్చర్ల: ఈనెల 20వ తేదీ నుంచి ఆలిండియా లారీల నిరవధిక బంద్ చేపడుతున్నట్లు జడ్చర్ల లారీ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్‌గౌడ్ తెలిపారు. ఈమేరకు బంద్ పోస్టర్లను శనివారం హైద రాబాద్ ప్రెస్‌క్లబ్‌లో లారీ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి విడుదల చేశారు. డీజిల్ ధరలు జీఎస్టీ పరిధిలోకి తేవాలని, దేశ వ్యాప్తంగా ఒకే ధర నిర్ణయించి మూడు నెలలకోసారి సవరించా లని డిమాండ్ చేశారు. అదేవిధంగా టోల్‌గేట్లు తొలగించాలని, పెంచిన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించాలని, లారీ యజమానుల నుంచి టీడీఎస్ వసూలు చేయొద్దన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సింగిల్ పర్మిట్ విధానం అమలుచేయాలని, ప్రమాదం లేదా ఓవర్‌లోడ్ విషయంలో డ్రైవర్ లైసెన్స్ రద్దు విధానాన్ని విర మించుకోవాలని కోరారు.
ఇంకా జిల్లాకో డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేయాలని, విద్యార్హతతో సంబం ధం లేకుండా లైసెన్స్‌లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, 2015 జూన్‌లో సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించే వరకు బంద్ కొనసాగిస్తామన్నారు. అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కుమార్‌గౌడ్, కార్యదర్శి వహీద్, శ్రీనువాసులు, శ్రీనివాస్‌గౌడ్, సుల్తాన్, రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment