lorrys strike
-
ఏకపక్ష నిర్ణయం
తెలుగుదేశం ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకోవడం.. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిన వెంటనే ఎందుకు తొందరపడ్డామా అనే ఆలోచనల చేయడం చంద్రబాబు ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఈ–పర్మిట్ విధానాన్ని కొత్తగా ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం రెండు నెలల కిత్రం ప్రకటించింది. ఈ విధానంలో పలు లోపాలు, వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అమలు చేయాలా వద్దా అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. నెల్లూరు(సెంట్రల్): ఈ–పర్మిట్ విధానం వల్ల లారీ డ్రైవర్లకు, యజమానులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, ఇటీవల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ–పర్మిట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. దీంతో ఈ–పర్మిట్ విధానంపై అమలుపై టీడీపీ ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లు సమాచారం. యజమానుల నుంచి వ్యతిరేకత వ్యవసాయ ఉత్పత్తుల రవాణా వ్యాపారులకు లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. ఇందు కోసం వీరికి యూజర్ ఐడీ, పాస్వర్డ్ అందజేస్తారు. దీని ద్వారా ఆన్లైన్లో ఈ రవాణా పర్మిట్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత అధికారులు అనుమతులు అడిగినప్పుడు ఈ పర్మిట్‌ను చూపించాల్సి ఉంటుంది. అపరాధ రుసుం చెల్లించాల్సి ఉన్నా ఆన్లైన్లో చెల్లించాలి. కాగా ఈ పర్మిట్ తీసుకునే విధంగా ఎంత మందికి అవగాహన ఉందనే అనుమానాలు కలుగమానడం లేదు. లారీల్లో సరుకు రవాణా చేసే వారు అపరాధ రుసుం చెల్లించాలంటే ఆన్లైన్లోనే కట్టాలని చెబుతున్నా... ఏ విదంగా , ఎవరి వద్ద ఆన్లైన్లో కట్టాలనేది స్పష్టత లేదు. ప్రధానంగా లారీ డ్రైవర్ల వద్ద ఏటీఎంలు ఉంటాయా.. అనే అనుమానాలు కూడా కలుగ మానడం లేదు. ఆన్లైన్లో అనుమతులు తీసుకున్న వాహనం గంటల వ్యవధిలోనే మాత్రమే ఆ అనుమతి ఉంటుంది. ఏదైనా అంతరాయం ఏర్పడి వాహనం వెళ్లలేకుండా ఉంటే తిరిగి మళ్లీ ఆన్లైన్లోనే అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆన్లైన్ వ్యవస్థతో మోటర్ ఫీల్ట్‌లో ఉండే వారికి పెద్దగా అవగాహన లేకపోవడంతోపాటు, ఇబ్బందులు ఉండటంతో లారీ యజమానుల రాష్ట్రంలోని పలు జిల్లాలలో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విధంగా వ్యతిరేకత వస్తుండటంతో ఈ–పర్మిట్ విధానంపై ప్రభుత్వం వెనక్కు తగ్గిందని తెలుస్తోంది. రెండు నెలలుగా.. ఈ పర్మిట్ విధానం అమలు చేస్తామని మే నెలలో వ్యవసాయమార్కెట్ శాఖ అధికారులు చెప్పుకొచ్చారు. జూన్ మొదటి నుంచి అమలులోకి వస్తుందని, తరువాత కొన్ని కారణాల వల్ల జూలై మొదటి నుంచి వస్తుందని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఈ పర్మిట్ విధానాన్ని సీఎం చేతుల మీదుగా ఈనెల 5వ తేదీన ప్రారంభమవుతుందని, రాష్ట్రం మొత్తం ఆ రోజు నుంచే అమలులోకి వస్తుందని సర్కారు పెద్దలు చెప్పుకుంటూ వచ్చారు. ఇంత వరకు ఆ ఊసే లేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం రానున్నది ఎన్నికల సమయం కావున, వాహన యజమానుల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. ఏటా రూ.26 కోట్ల ఆదాయం జిల్లాలో నెల్లూరు, కోవూరు, కావలి, సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు, వాకాడు, రాపూరు, ఆత్మకూరు, ఉదయగిరి, వెంకటగిరి ప్రాంతాల్లో 11 వ్యవసాయ మార్కెట్ కమీటీలు ఉండగా.. వీటి పరిధిలో 22 మార్కెట్ చెక్‌పోస్టులు ఉన్నాయి. వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించిన కూరగాయలు, పండ్లు, బియ్యం, «ధాన్యం, చిరుధాన్యాలు, ఇతర 130 రకాల వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు సంబంధించి ఆయా వ్యాపారులు ఒక శాతం సెస్సును మార్కెట్శాఖకు కట్టాల్సి ఉంటుంది. దీని ద్వారా ఏటా రూ.24 కోట్ల నుంచి రూ.26 కోట్ల వరకు జిల్లా నుంచి ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంటుంది. ఆన్లైన్ లో ఈ–పర్మిట్ విధానంతో ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ మాత్రం పూర్తి చేయలేమని జిల్లాలోని మార్కెట్‌కమిటీ అధికారులు చెబుతుండటం విశేషం. -
20నుంచి లారీల బంద్
జడ్చర్ల: ఈనెల 20వ తేదీ నుంచి ఆలిండియా లారీల నిరవధిక బంద్ చేపడుతున్నట్లు జడ్చర్ల లారీ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్‌గౌడ్ తెలిపారు. ఈమేరకు బంద్ పోస్టర్లను శనివారం హైద రాబాద్ ప్రెస్‌క్లబ్‌లో లారీ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి విడుదల చేశారు. డీజిల్ ధరలు జీఎస్టీ పరిధిలోకి తేవాలని, దేశ వ్యాప్తంగా ఒకే ధర నిర్ణయించి మూడు నెలలకోసారి సవరించా లని డిమాండ్ చేశారు. అదేవిధంగా టోల్గేట్లు తొలగించాలని, పెంచిన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించాలని, లారీ యజమానుల నుంచి టీడీఎస్ వసూలు చేయొద్దన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సింగిల్ పర్మిట్ విధానం అమలుచేయాలని, ప్రమాదం లేదా ఓవర్‌లోడ్ విషయంలో డ్రైవర్ లైసెన్స్ రద్దు విధానాన్ని విర మించుకోవాలని కోరారు. ఇంకా జిల్లాకో డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేయాలని, విద్యార్హతతో సంబం ధం లేకుండా లైసెన్స్‌లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, 2015 జూన్‌లో సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించే వరకు బంద్ కొనసాగిస్తామన్నారు. అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కుమార్‌గౌడ్, కార్యదర్శి వహీద్, శ్రీనువాసులు, శ్రీనివాస్‌గౌడ్, సుల్తాన్, రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
లారీల సమ్మె ఇక మరింత ఉధృతం
లారీ ఓనర్స్ అసోసియేష¯ŒS జిల్లా అధ్యక్షుడు చిర్ల అమ్మిరెడ్డి గోకవరం (జగ్గంపేట) : లారీ యజమానుల డిమాండ్లు పరిష్కరించేంత వరకూ సమ్మెను ఉధృతంగా చేస్తామని లారీ ఓనర్స్ అసోసియేష¯ŒS జిల్లా అధ్యక్షుడు చిర్ల అమ్మిరెడ్డి తెలిపారు. మండలంలో గుమ్మళ్లదొడ్డి శివారులో ఉన్న ఐఓసీఎల్ ప్లాంట్ ఎదురుగా డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జిల్లాలోని పలు లారీ, వ్యా¯ŒS యూనియ¯ŒS నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు విఫలమైనందున ఈ నెల 8 నుంచి ఆలిండియా బంద్‌కు పిలుపు ఇచ్చామన్నారు. మంగళవారానికి సమ్మె ఆరో రోజుకు చేరిందని, అవసరమైతే నిత్యావసర సరుకుల లారీలను కూడా నిలిపివేస్తామని హెచ్చరించారు. జిల్లా లారీ ఓనర్స్ అసోసియేష¯ŒS కార్యదర్శి ఎంఆర్ శేఖర్‌రెడ్డి, గోదావరి నేషనల్ అసోసియేష¯ŒS అధ్యక్షుడు సీహెచ్ ఆంజనేయప్రసాద్, కార్యదర్శి దుర్గాప్రసాద్, గోకవరం, పిఠాపురం, సోమేశ్వరం, కేశవరం, ఆలమూరు, పెద్దాపురం, రాజమహేంద్రవరం, రావులపాలెం, ద్వారపూడి, అనపర్తి, కత్తిపూడి, బలభద్రపురం, బిక్కవోలు, సామర్లకోట, రాజోలు, కొత్తపల్లి తదితర లారీ, వ్యా¯ŒS అసోసియేష¯ŒS నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న కోరుకొండ సీఐ మధుసూదనరావు, గోకవరం ఎస్సై వెంకటసురేష్, తిరుపతిరావు, సిబ్బందితో ఐఓసీఎల్ ప్లాంట్ బందోబస్తు నిర్వహించారు. -
స్తంభించిన రవాణా
చార్జీలపై లారీల సమ్మె ఫైనా¯Œ్స ఎంట్రీ వందల రెట్లు పెరుగుదల రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్ ఆలస్యమైనా జేబు గుల్లే సాక్షి, రాజమహేంద్రవరం: రవాణారంగానికి సంబంధించిన చట్టానికి సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనివల్ల రవాణారంగం కుదేలవుతుందని రవాణాదార్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మోటారు వెహికల్ నిబంధనల చట్టం (1989)లో చార్జీలకు సంబంధించిన రూల్ నం. 32, 81లను సవరించడంతో సరుకు రవాణా వాహనాలపై చార్జీలు భారీగా పెరిగిపోయాయి. దీన్ని నిరసిస్తూ పలు మార్లు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. గత నెల తొమ్మిదో తేదీన బంద్ పాటించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో గురువారం నుంచి దేశ వ్యాప్తంగా సమ్మె చేపట్టారు. ఆందోళనలు ఇందుకే.. మోటార్‌సైకిల్ రిజిస్ట్రేష¯ŒS చార్జీ గతంలో రూ.450 ఉండగా ప్రస్తుతం రూ.685 చలానా కట్టించుకుంటున్నారు. కారుకు గతంలో రూ. 735 ఉండగా అది రూ. 1135కు పెరిగింది. కారు ఫైనా¯Œ్స ఎంట్రీ రూ. 735 ఉండగా అది కాస్త మూడురెట్లు పెరిగి రూ. 2,035లకు చేరుకుంది. ఆటో, లైట్వెహికల్, వ్యవసాయ అవసరాలకు వినియోగించే ట్రాక్టర్ రిజిస్ట్రేషన్, ట్రా¯Œ్సఫర్, ఫైనా¯Œ్స ఎంట్రీ చార్జీలు విపరీతంగా పెంచారు. ఈ వాహనాలకు గతంలో రిజిస్ట్రేష¯ŒS చార్జీ చలానా రూ.450 నుంచి రూ. 1150లకు పెంచారు. ట్రా¯Œ్సఫర్ రూ. 250 నుంచి రూ.650లకు, ఫైనా¯Œ్స ఎంట్రీ రూ.100 నుంచి ఏకంగా రూ.1650లకు పెంచేశారు. లారీ రిజిస్ట్రేష¯ŒS గతంలో రూ. 900 ఉండగా ఇప్పడు రెట్టింపయింది. ట్రా¯Œ్సఫర్ చలానా రూ. 600 నుంచి రూ.1050కు పెంచారు. ఫైనా¯Œ్స ఎంట్రీ రూ. 400 ఉండగా ఇప్పడు రూ. 3,300లకు చేరుకుంది. వాహనాలు రిజిస్ట్రేష¯ŒS చేయించడంలో ఆలస్యమైతే అపరాధ రుసుం ప్రతి మూడు నెలలకో విధంగా పెంచారు. గతంలో ఏదైనా వాహనం విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటే ఆవాహనాలపై చార్జీ రూ. 100 ఉండగా ఇప్పుడు దాన్ని రూ. 2,500 చేశారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ ఆలస్యంపై బాదుడే.. సాధారణంగా ప్రతి ఏడాదీ వాహనాన్ని పరీక్షంపజేసుకుని ఫిట్¯ðనెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి. కొత్త నిబంధనల ప్రకారం ఈ సర్టిఫికెట్ ఆలస్యమైతే గడువుతీరిన తర్వాత రోజుకు రూ. 50 చొప్పున అపరాధ రుసుం విధిస్తారు. ఆందోళనలు విరమించేది లేదు రాష్ట్ర విభజన తర్వాత రవాణా రంగం కుదేలయింది. అప్పటికే చార్జీలు కట్టినా తెలంగాణలోకి వెళితే తాజాగా చలానాలు కట్టించుకుంటున్నారు. ఇప్పుడు ఈ చార్జీలు పెంచడం వల్ల రవాణా రంగం కోలుకోలేదు. ఆదాయమే పరమావధిగా చార్జీలను విపరీతంగా పెంచేశారు. ప్రభుత్వం తమ నిర్ణయంపై పునరాలోచన చేసే వరకు సమ్మె కొనసాగుతుంది. – వాసంశెట్టి గంగాధరరావు, ఆటోవర్కర్స్ యూనియ¯ŒS ప్రెసిడెంట్, రాజమహేంద్రవరం