
‘హోంగార్డులను క్రమబద్ధీకరించండి’
శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ హోంగార్డ్స్‌కు స్పెషల్ పోలీస్ అసిస్టెంట్ పోస్ట్‌ను ఏర్పాటు చేసి, పే స్కేల్, ఉద్యోగ, ఆరోగ్య భద్రత, అలవెన్స్, డ్రెస్సులు ఇవ్వాలని కోరారు. దీని పై పలుమార్లు డీజీపీ, హోం కార్యదర్శికి విన్నవించామన్నారు. డిమాండ్లపై హోం కార్యదర్శి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో హోం గార్డ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేందర్, ప్రధాన కార్యదర్శి కుమారస్వామి, దయానంద్ పాల్గొన్నారు.