సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌ను పూర్తి స్థాయి హెల్త్ హబ్‌గా మార్చేందుకు దోహదపడే ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర వైద్య ఆర్యోగ శాఖ మంత్రి జేపీ నడ్డాను రాష్ట్ర మంత్రి లక్ష్మారెడ్డి కోరారు. శుక్రవారం కేంద్ర మంత్రులను పార్లమెంటులో కలుసుకున్న ఆయన తెలంగాణకు ఎయిమ్స్ ప్రకటించి ఏడాది పూర్తయినా ఇప్పటి వరకు నిధులు విడుదల చేయలేదని వివరించారు.
ఎయిమ్స్ ఏర్పాటు అవసరమైన స్థలం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అనంతరం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుదాన్‌ను కలిసిన లక్ష్మారెడ్డి ఎయిమ్స్ ఏర్పాటు ప్రక్రియపై చర్చించారు. కేంద్ర మంత్రులను కలిసిన వారిలో టీఆర్‌ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి, జి.నగేశ్, సీతారాంనాయక్, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment