
సుజిత్, ప్రవల్లిక
దర్శకుడు సుజిత్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రవల్లిక అనే దంతవైద్యురాలితో సుజిత్ నిశ్చితార్థం హైదరాబాద్‌లో జరిగింది. కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. సుజిత్, ప్రవల్లికలు ప్రేమించుకున్నారని సమాచారం. వీరి ప్రేమను అంగీకరించి ఇద్దరి కుటుంబ సభ్యులు నిశ్చితార్థం జరిపించారని తెలిసింది. వచ్చే ఏడాది సుజిత్, ప్రవల్లికల వివాహం జరగనుందట. ఇక సుజిత్ విషయానికి వస్తే... ‘రన్ రాజా రన్’ (2014) చిత్రంతో దర్శకుడిగా కెరీర్‌ను ఆరంభించారు. శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా ‘సాహో’ చిత్రాన్ని తెరకెక్కించారు సుజిత్. ఇప్పుడు మలయాళ హిట్ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌కి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారు. ఇందులో చిరంజీవి హీరోగా నటించబోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment