director sujith
-
వచ్చే ఏడాది పెళ్లి
దర్శకుడు సుజిత్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రవల్లిక అనే దంతవైద్యురాలితో సుజిత్ నిశ్చితార్థం హైదరాబాద్‌లో జరిగింది. కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. సుజిత్, ప్రవల్లికలు ప్రేమించుకున్నారని సమాచారం. వీరి ప్రేమను అంగీకరించి ఇద్దరి కుటుంబ సభ్యులు నిశ్చితార్థం జరిపించారని తెలిసింది. వచ్చే ఏడాది సుజిత్, ప్రవల్లికల వివాహం జరగనుందట. ఇక సుజిత్ విషయానికి వస్తే... ‘రన్ రాజా రన్’ (2014) చిత్రంతో దర్శకుడిగా కెరీర్‌ను ఆరంభించారు. శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా ‘సాహో’ చిత్రాన్ని తెరకెక్కించారు సుజిత్. ఇప్పుడు మలయాళ హిట్ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌కి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారు. ఇందులో చిరంజీవి హీరోగా నటించబోతున్నారు. -
అలా చేస్తే సినిమా బాగాలేదని ఒప్పుకున్నట్లే!
‘‘దెబ్బలు ఎక్కడ పడ్డాయో తెలుసు, బెటర్ చేసుకుంటా. ఓ పది రోజులు బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకున్నా, అది ఎవరో పెట్టిన రచ్చకు మనం ఆలోచిస్తున్నట్టు ఉంటుంది. ఫ్రెష్‌గా మొదలుపెడతాను’’ అన్నారు సుజీత్. ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ‘సాహో’ ఆగస్ట్ 30న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దర్శకుడు సుజీత్ ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు. ► ‘సాహో’ సినిమాకు వస్తున్న స్పందన ఎలా ఉంది? ప్రస్తుతం బెటర్‌గా ఉంది. ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. కలెక్షన్లు బావున్నందుకు హ్యాపీ. రివ్యూలు కఠినంగా ఉన్నాయనిపించింది. మరీ అంత సెన్సిబులిటీస్ లేకుండా తీయను కదా? షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చాను. నా జర్నీ వేరే వాళ్లకు ఆశ కలిగించాలి. నా టీమ్ నన్ను బాగా సపోర్ట్ చేసింది. ప్రభాస్ అన్న, నిర్మాతలు రివ్యూలకు కంగారు పడొద్దని ధైర్యం ఇచ్చారు. రివ్యూ రాసేవాళ్లు సినిమాను సినిమాలా చూడకుండా కొంచెం పర్సనల్ అయినట్టు అనిపించింది. బహుశా వాళ్లు ‘బాహుబలి 3’లా ఉంటుందని ఊహించుకొని ఉండొచ్చు. వాళ్లు ఊహించినట్టు సినిమా లేకుండా ఉండి ఉండొచ్చు. బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్ష్ బాలేదు అన్నట్టు రాశారు. రెండు రోజుల తర్వాత ‘ఎక్కువగా ఊహించుకొని వెళ్లడం వల్ల ఎంజాయ్ చేయలేదేమో’ అన్నారు. అయితే నాకు కోపం ఏమీ లేదు. హిందీ వాళ్లు ఏ ఉద్దేశంతో తక్కువ రేటింగ్ ఇచ్చారో? మన వాళ్లు కూడా అలానే రాశారు కదా (నవ్వుతూ). అది ఆడియన్స్‌ను సినిమాకు వెళ్లకుండా ఆపేస్తుంది. రివ్యూలను ఒకటీ రెండు రోజులు ఆపితే బావుండు అనిపిస్తుంది. రన్నింగ్ కామెంట్రీ ఇస్తున్నారు. కొంచెం బాధ అనిపించింది. ► ‘బాహుబలి’తో ప్రభాస్‌కి వచ్చిన స్టార్డమ్ వల్ల స్క్రిప్ట్‌లో ఏదైనా మార్పులు చేశారా? ఏ మార్పులూ చేయలేదు. అయితే యాక్షన్‌లో చేశాం. దాని వల్ల యాక్షన్ పెద్దగా అనిపించి కథ లేదనిపించిందేమో? సినిమాలో కథ ఉంది. కథ లేదంటే నేను ఒప్పుకోను. ఒకటి ఎక్కువ డామినేట్ చేస్తే మిగతావి చిన్నగా అనిపిస్తాయి. ఉదాహరణకు సినిమాలో పాటల్లాగా. ఒక పాట బావుంటే మిగతావి కిల్ అయిపోతుంటాయి. ► 300 కోట్ల సినిమాను డీల్ చేయడం ఎలా అనిపిం చింది? 350 కోట్లతో సినిమా చేయాలనే లక్ష్యంతో చేయలేదు. అలానే అనుకుంటే ఆ రోజే చేసేవాళ్లం కాదేమో? రాజమౌళి గారు ‘బాహుబలి’ని ఒక్క సినిమాలా చేయాలనుకున్నారు. మొదలుపెట్టాక రెండు భాగాలు అయింది. ఎవ్వరైనా సరే పనిలో దిగిన తర్వాతే పెరిగే చాన్స్ ఉంటుంది. సినిమా సినిమాకు విధానం మారిపోతుంది. కథకు ఏం కావాలో అది చేస్తుంటాం. బడ్జెట్ ఎంతైనా సరే అది స్క్రీన్ మీద కనబడాలనుకున్నాం. ► ‘అనుభవం లేని కుర్రాడితో’ సినిమా ఏంటి? అనే కామెంట్స్ వినిపించాయి... అవి నా వరకూ రాలేదు. నాకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ లేరు. పనైపోగానే ఇంటికి వెళ్లిపోతాను. మళ్లీ ఆఫీస్‌కి వచ్చి పని చేసుకోవడమే. ఆ మధ్య ఫిల్మ్ చాంబర్‌కు వెళ్ళినప్పుడు ‘సాహో చాలా పెద్ద సినిమా’ అని మాట్లాడుతుంటే కొంచెం భయమేసింది. రియాలిటీ నిజంగా భయపెడుతుంది. కొన్నిసార్లు మనం అనుకున్నది సాధించాలంటే వాస్తవికతకు దూరంగా ఉండి ప్యాషన్‌తో పని చేస్తుండాలి. ఫీల్డ్‌లో దిగిన తర్వాత ఆలోచనలు ఉండకూడదు. ► బడ్జెట్ పెరిగిపోతున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? భయం కంటే బాధ్యత ఎక్కువ. బడ్జెట్ ఇలా పెరిగింది.. అలా పెరిగింది అని చెబితే వేరేవాళ్లను నిందించినట్టు ఉంటుంది. అది నాకు ఇష్టం లేదు. సినిమా చేయడం కూడా పెళ్లి లాంటిదే. అక్కడ ఆ పూలు ఉంటే బావుంటుంది అనిపిస్తుంది. కొంచెం ఖర్చయినా తెప్పిస్తాం. చూసే వాళ్లందరికీ నచ్చాలి అన్నట్టు చేస్తాం. పెళ్లి వల్ల ఏం వస్తుంది? అయిపోయిన తర్వాత అందరూ వెళ్లిపోతారు. కానీ మన బెస్ట్ ఇవ్వాలనుకుంటాం. రిజల్ట్ గురించి ఎక్కువగా ఆలోచించలేదు. ప్యాషన్‌తో చేశాం. డబ్బులు వృథాగా ఖర్చు చేశారనేవాళ్లు అంటూనే ఉంటారు. ► ప్రభాస్ ప్యాన్ ఇండియా సూపర్‌స్టార్ అయ్యారు. ఆయన స్టార్డమ్ కోసం అయినా ‘సాహో’ హిట్ అవాల్సిన పరిస్థతి. అదేమైనా ఒత్తిడిగా? కచ్చితంగా అనిపించింది. ప్రభాస్‌గారి పేరు పెంచకపోయినా ఫర్వాలేదు కానీ తగ్గించకూడదు అనుకున్నాం. ఈ రివ్యూలతోనూ నార్త్‌లో కలెక్షన్స్ చూస్తుంటే ప్రభాస్‌ని నార్త్‌లో ఎంత ప్రేమిస్తున్నారో అర్థం అవుతోంది. ► ‘మళ్లీ ఒక్కసారి చూడండి. నచ్చుతుంది’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్‌గా పోస్ట్ చేశారు..? ఎమోషనల్‌గా కాకుండా ఫైర్ అయిపోదాం అన్నట్టు పోస్ట్ చేయాలనుకున్నాను. మళ్లీ ఆగిపోయాను. ‘రెండోసారి చూశాక బాగా నచ్చింది’ అంటూ చాలా మెసేజ్‌లు వచ్చాయి. రెండో సారి చూస్తే అర్థం చేసుకుంటున్నారు అనిపించింది. రెండోసారి చూసి కలెక్షన్లు పెంచేయండి అనే ఉద్దేశంతో అనలేదు. అర్థం కాలేదు అనడం వేరు. అర్థం లేదు అనడం వేరు. అర్థం లేకుండా సన్నివేశాలు రాయలేదు.. తీయలేదు. దేశం మొత్తంగా అందర్నీ మెప్పించే సినిమా తీయడం చాలా కష్టం. ఈ సినిమా ద్వారా పెద్ద స్టార్స్‌తో తీస్తున్నప్పుడు ప్రతీ విషయాన్ని ఒలిచి చెప్పాలని నేర్చుకున్నా. ఇంటెలిజెన్స్‌ని కొంచెం తగ్గించుకొని సినిమాలు చేయాలి. ► మీ కెరీర్‌కు ‘సాహో’ ప్లస్సా? మైనస్ అంటారా? దర్శకుడిగా ఈ సినిమా ద్వారా చాలా నేర్చుకున్నాను. ఒక్క సినిమాతో చాలా విషయాలు నేర్చుకున్నాను. కొత్త టెక్నాలజీలు తెలుసుకున్నాను. నేను ఈ సినిమా చేసినందుకు గర్వంగా ఉన్నాను. ఆడియన్స్ చెప్పిన దాన్ని కచ్చితంగా గౌరవిస్తాను. ► ఒక అవకాశం వస్తే ‘సాహో’లో ఏదైనా మారుస్తారా? లేదు. రిలీజ్ అయిన తర్వాత సినిమా మన చేతుల్లో నుంచి ప్రేక్షకులకు వెళ్లిపోయినట్టే. కట్ చేసినా, ట్రిమ్ చేసినా మనం సినిమా బాగాలేదని ఒప్పుకున్నట్టే అవుతుంది. ► ‘సాహో’ కథ హాలీవుడ్ సినిమా ‘లార్గో వించ్’ పాయింట్ నుంచి తీసుకున్నారనే కామెంట్స్ గురించి? ఇలా కామెంట్ చేసే వాళ్లలో సగం మంది ‘లార్గో వించ్’ సినిమా చూసి ఉండరు. చూసే సినిమా కూడా కాదది. ‘ప్రపంచానికి తెలియకుండా కొడుకుని ఓ తండ్రి దాచిపెట్టడం అనే కాన్సెప్ట్‌తో ఇది వరకు చాలా సినిమాలు వచ్చాయి’. ఆ సినిమా స్క్రీన్‌ప్లే వేరు. నా సినిమా స్క్రీన్‌ప్లే వేరు. వాళ్లకు నెక్ట్స్ సినిమా రిలీజ్ వరకూ ఫీడింగ్ కావాలి. ప్రస్తుతానికి మేమే ఉన్నాం. ఈ కాంట్రవర్శీ ఇంకా జనాల్లో ఉండాలి. అందుకే రాస్తుంటారు. ఓ పెద్ద హిట్ సినిమా నుంచి ప్రేరణ పొందాం అని చెప్పినా సంతోషపడొచ్చు. ► ఇదంతా మీ మీద ఏదైనా ప్రభావం చూపిస్తుందా? ఇది రియాలిటీ. ఈ వారం నేను, నెక్ట్స్ వారం మరొకరు. జనం మారుతుంటారు. కథ మాత్రం ఇలానే జరుగుతుంటుంది. ఆ కాంట్రవర్శీలు ఇక్కడితో ఆగిపోవాలా, ఇంకా నడుస్తుండాలా అన్నది నా చేతుల్లో ఉంది. దాని గురించి మాట్లాడి ఇంకో నాలుగు రోజులు ఫీడింగ్ ఇవ్వదలచుకోలేదు. -
సాహో.. ఎవరికీ తెలీదంట!
దుబాయ్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సాహో చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం కోసం ఎంపిక భారీ స్టార్ క్యాస్టింగ్‌ను ఎంపిక చేసుకుంటూ పోతున్నారు. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ నుంచి పలువురు స్టార్లను తీసుకున్నారు. ఇప్పుడు దీనికి మాలీవుడ్ టచ్ కూడా ఇచ్చేశారు. మాలీవుడ్ సీనియర్ నటుడు లాల్(తెలుగులో అన్నవరం, ఖతర్నాక్ ఫేమ్) సాహో షూటింగ్లో పాల్గొన్నారు. అబుదాబి షెడ్యూలో అయిన చిత్ర యూనిట్‌తో కలిశారు. ప్రభాస్‌తో దిగిన ఫోటోను నాలుగైదు రోజుల క్రితం పోస్ట్ చేశారు కూడా. ఈ సందర్భంగా ఓ మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లాల్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘ఈ చిత్రంలో నాది పాజిటివ్ పాత్ర. అంతకు మించి ఏం అడక్కండి. నేనూ చెప్పలేను. ఎందుకంటే ఈ సినిమా కథను దర్శకుడు నాక్కూడా పూర్తిగా చెప్పలేదు. నాకే కాదు ఇప్పుడు షూటింగ్లో పాల్గొంటున్న తారలేవరికీ ఈ చిత్ర కథ పూర్తిగా తెలీదు. ఇంకా చాలా షూటింగ్ జరుపుకోవాల్సి ఉంది. బహుశా అందుకే లీకులు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారేమో’ అని లాల్ చెప్పారు. ఈ లెక్కన్న కథ విషయంలో సుజిత్ చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడన్నది అర్థమౌతోంది. ప్రభాస్ సరసన బాలీవుడ్ సుందరి శ్రద్ధాకపూర్ హీరోయిన్గా, శంకర్-ఎహ్సన్-లాయ్ త్రయం సంగీతాన్ని అందిస్తుండగా, యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ప్రభాస్ అందర్నీ ప్రేమలో పడేస్తాడు!
బాహుబలి సిరిస్‌తో ప్రభాస్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యాడు. ప్రభాస్ గురించి ఏ చిన్న విషయమైనా దేశం మొత్తం చూస్తోంది. బాహుబలితో అంతగా ఫేమస్ అయిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ సాహో షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అబుదాబిలో భారీ యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కించే పనిలో ఉన్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు నీల్ నితీన్ ముఖేష్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్‌తో తను, తన భార్యతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్చేశాడు. ‘ నేషనల్ డార్లింగ్ ప్రభాస్. అతను చాలా ఆత్మీయంగా మాట్లాడుతాడు. ఆయన పిలిచిన వెంటనే మాతో వచ్చి గడిపిన తీరు మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అతను అందర్నీ వెంటనే ప్రేమలో పడేస్తాడు’ అంటూ ఫోటోతో పాటు, కామెంట్‌ను పోస్ట్ చేశాడు. రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వం వహించగా, యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. -
ముంబయ్‌లో... వర్షంలో..!
డార్లింగ్ ప్రభాస్‌కి వర్షం అంటే బీభత్సమైన లవ్వు. ఎందుకంటే... సారుగారు భారీ కమర్షియల్ సక్సెస్‌ను రుచి చూసింది ‘వర్షం’తోనే కదా! సినిమాతో పాటు అందులో ప్రభాస్ చేసే రెయిన్ ఫైట్స్ పిచ్చ ఫేమస్. తర్వాత ‘మిర్చి’లో రెయిన్ ఫైట్ కూడా ఫేమస్సే. ఇప్పుడు ప్రభాస్ తర్వాతి సినిమా ‘సాహో’లో కూడా రెయిన్ ఫైట్స్ ఉన్నాయి. చిన్న ఛేంజ్ ఏంటంటే... ‘వర్షం, మిర్చి’ల్లోవి రూరల్ రెయిన్ ఫైట్స్. ‘సాహో’కి మాత్రం సై్టలిష్ అండ్ మోడ్రన్ రెయిన్ ఫైట్ డిజైన్ చేస్తున్నారు. ఈ ఫైటును ముంబయ్ రోడ్స్ మీద షూట్ చేయనున్నారు. ఏం... హైదరాబాద్‌లో షూట్ చేయకూడదా? అనే డౌట్ రావొచ్చు. ‘సాహో’ కథ ముంబయ్ నేపథ్యంలో సాగుతుందట. అందుకే, ముంబయ్ను సెలెక్ట్ చేసుకున్నారు. ప్రసుతం అమెరికాలో హాలిడేలో ఉన్న ప్రభాస్ హైదరాబాద్ తిరిగొచ్చిన తర్వాత జూన్‌లో ‘సాహో’ షూటింగ్ ప్రారంభిస్తారు. సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జస్ట్... ఆరు నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేశారట. -
ప్రభాస్ సరసన మళ్లీ అనుష్క?
మిర్చి సినిమాలో స్టైలిష్‌గా కనపడే ప్రభాస్ సరసన అనుష్కను చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అంతకుముందే బిల్లాలో కూడా చేసినా.. మిర్చిలో వాళ్లిద్దరి జంట సూపర్బ్‌గా ఉందని ఆడియన్స్ టాక్. ఆ తర్వాత ఇక బాహుబలిలో అయితే దేవసేన-అమరేంద్ర బాహుబలి ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడినట్లుగా మరీ చేశారు. ఇలా ఇప్పటికే మూడు సినిమాల్లో హిట్ పెయిర్ అయిన వీళ్లిద్దరూ మరోసారి జంటగా చేయబోతున్నారని టాలీవుడ్ వర్గాల టాక్. ప్రభాస్ కొత్త సినిమా సాహోకు ఇప్పటికీ హీరోయిన్లు ఎవరూ ఖరారు కాకపోవడంతో రీసెంట్ హిట్ జంట అయిన అనుష్కనే ఫైనల్ చేస్తే ఎలా ఉంటుందని సినిమా వర్గాలు భావిస్తున్నాయంటున్నారు. తొలుత ఈ చాన్స్ ఎవరైనా బాలీవుడ్ బ్యూటీకి ఇద్దామా అనుకున్నారు. కానీ వాళ్లు మరీ కళ్లు తిరిగే రేట్లు చెప్పడంతో అటువైపు చూడటం కూడా మానుకున్నారు. ఇప్పటికీ జనంలో బాహుబలి క్రేజ్ తగ్గలేదు కాబట్టి, దాన్ని క్యాష్ చేసుకోవాలంటే ప్రభాస్ సరసన అనుష్కను దించడమే కరెక్ట్ అని అనుకుంటున్నారట. బాహుబలి-2 సినిమా రికార్డులన్నింటినీ తిరగరాస్తుండటంతో ప్రభాస్ కూడా నేషనల్ స్టార్ అయిపోయాడు. సాహో టీజర్‌కు కూడా మంచి రెస్సాన్స్ వచ్చింది. దాంతో తెలుగు, తమిళం, మళయాళం, హిందీ నాలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో ఆమెనే ఖరారు చేయాలని దర్శకుడు సుజిత్ కూడా అనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. -
రెండు భాషలపై కన్ను!
ప్రభాస్ ఎవరనేది ఇప్పుడు భారతీయ సినీ ప్రేక్షకులకు ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. ఈ యంగ్ హీరోకి ‘బాహుబలి’తో ఫాలోయింగ్ బాగా పెరిగింది. తెలుగుతో పాటు ఇప్పుడు తమిళ, హిందీ భాషల్లో ప్రభాస్‌కు అభిమానులున్నారు. అందువల్ల, ‘బాహుబలి’ తర్వాత బైలింగ్వల్, మల్టీ లింగ్వల్ సినిమాలు చేయాలని ప్రభాస్ నిర్ణయించుకున్నారు. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో నటించే సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో చేస్తున్నట్టు ప్రకటించారు. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో నటించే సినిమానూ మల్టీ లాంగ్వేజెస్‌లో తీయాలనుకుంటున్నారట. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత తమిళ దర్శకుడు అట్లీతో ప్రభాస్ సినిమా చేయనున్నారనేది చెన్నై కోడంబాక్కమ్ వర్గాల సమాచారం. అట్లీ దర్శకత్వం వహించిన రెండు తమిళ సినిమాలు (‘రాజా రాణి’, ‘పోలీస్’) తెలుగులో అనువాద మయ్యాయి. రెండిటికీ తెలుగులో మంచి పేరొచ్చింది. ముఖ్యంగా ‘పోలీస్’లో తమిళ మాస్ హీరో విజయ్ను చూపించిన తీరు ప్రభాస్‌కు నచ్చిందట! దాంతో అట్లీకి కబురు చేసి, తెలుగు, తమిళ బైలింగ్వల్ సినిమాకు కథ ఉంటే చెప్పమని అడిగారట. హీరో, దర్శకుల మధ్య చర్చలు జరిగినట్టు భోగట్టా. ప్రస్తుతం విజయ్ హీరోగా అట్లీ ఓ సినిమా చేస్తున్నారు. బహుశా ఆ సినిమా పూర్తయ్యాక ప్రభాస్ సినిమా ప్రారంభిస్తారేమో! ఈలోపు సుజీత్, రాధాకృష్ణ సినిమాలను ప్రభాస్ పూర్తి చేయాలనుకుంటున్నారట!