ప్రభాస్ సరసన మళ్లీ అనుష్క? | prabhas and anushka likely to pair again in saaho | Sakshi
Sakshi News home page

ప్రభాస్ సరసన మళ్లీ అనుష్క?

Published Thu, May 18 2017 8:11 PM | Last Updated on Wed, Jul 17 2019 9:52 AM

ప్రభాస్ సరసన మళ్లీ అనుష్క? - Sakshi

ప్రభాస్ సరసన మళ్లీ అనుష్క?

మిర్చి సినిమాలో స్టైలిష్‌గా కనపడే ప్రభాస్ సరసన అనుష్కను చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అంతకుముందే బిల్లాలో కూడా చేసినా.. మిర్చిలో వాళ్లిద్దరి జంట సూపర్బ్‌గా ఉందని ఆడియన్స్ టాక్. ఆ తర్వాత ఇక బాహుబలిలో అయితే దేవసేన-అమరేంద్ర బాహుబలి ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడినట్లుగా మరీ చేశారు. ఇలా ఇప్పటికే మూడు సినిమాల్లో హిట్ పెయిర్ అయిన వీళ్లిద్దరూ మరోసారి జంటగా చేయబోతున్నారని టాలీవుడ్ వర్గాల టాక్. ప్రభాస్ కొత్త సినిమా సాహోకు ఇప్పటికీ హీరోయిన్లు ఎవరూ ఖరారు కాకపోవడంతో రీసెంట్ హిట్ జంట అయిన అనుష్కనే ఫైనల్ చేస్తే ఎలా ఉంటుందని సినిమా వర్గాలు భావిస్తున్నాయంటున్నారు.

తొలుత ఈ చాన్స్ ఎవరైనా బాలీవుడ్ బ్యూటీకి ఇద్దామా అనుకున్నారు. కానీ వాళ్లు మరీ కళ్లు తిరిగే రేట్లు చెప్పడంతో అటువైపు చూడటం కూడా మానుకున్నారు. ఇప్పటికీ జనంలో బాహుబలి క్రేజ్ తగ్గలేదు కాబట్టి, దాన్ని క్యాష్ చేసుకోవాలంటే ప్రభాస్ సరసన అనుష్కను దించడమే కరెక్ట్ అని అనుకుంటున్నారట. బాహుబలి-2 సినిమా రికార్డులన్నింటినీ తిరగరాస్తుండటంతో ప్రభాస్ కూడా నేషనల్ స్టార్ అయిపోయాడు. సాహో టీజర్‌కు కూడా మంచి రెస్సాన్స్ వచ్చింది. దాంతో తెలుగు, తమిళం, మళయాళం, హిందీ నాలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో ఆమెనే ఖరారు చేయాలని దర్శకుడు సుజిత్ కూడా అనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement