ముంబయ్‌లో... వర్షంలో..! | Prabhas 'sahoo' movie Mumbai background | Sakshi
Sakshi News home page

ముంబయ్‌లో... వర్షంలో..!

Published Fri, May 26 2017 11:53 PM | Last Updated on Wed, Jul 17 2019 10:14 AM

ముంబయ్‌లో... వర్షంలో..! - Sakshi

ముంబయ్‌లో... వర్షంలో..!

డార్లింగ్‌ ప్రభాస్‌కి వర్షం అంటే బీభత్సమైన లవ్వు. ఎందుకంటే... సారుగారు భారీ కమర్షియల్‌ సక్సెస్‌ను రుచి చూసింది ‘వర్షం’తోనే కదా! సినిమాతో పాటు అందులో ప్రభాస్‌ చేసే రెయిన్‌ ఫైట్స్‌ పిచ్చ ఫేమస్‌. తర్వాత ‘మిర్చి’లో రెయిన్‌ ఫైట్‌ కూడా ఫేమస్సే. ఇప్పుడు ప్రభాస్‌ తర్వాతి సినిమా ‘సాహో’లో కూడా రెయిన్‌ ఫైట్స్‌ ఉన్నాయి. చిన్న ఛేంజ్‌ ఏంటంటే... ‘వర్షం, మిర్చి’ల్లోవి రూరల్‌ రెయిన్‌ ఫైట్స్‌. ‘సాహో’కి మాత్రం సై్టలిష్‌ అండ్‌ మోడ్రన్‌ రెయిన్‌ ఫైట్‌ డిజైన్‌ చేస్తున్నారు.

 ఈ ఫైటును ముంబయ్‌ రోడ్స్‌ మీద షూట్‌ చేయనున్నారు. ఏం... హైదరాబాద్‌లో షూట్‌ చేయకూడదా? అనే డౌట్‌ రావొచ్చు. ‘సాహో’ కథ ముంబయ్‌ నేపథ్యంలో సాగుతుందట. అందుకే, ముంబయ్‌ను సెలెక్ట్‌ చేసుకున్నారు. ప్రసుతం అమెరికాలో హాలిడేలో ఉన్న ప్రభాస్‌ హైదరాబాద్‌ తిరిగొచ్చిన తర్వాత జూన్‌లో ‘సాహో’ షూటింగ్‌ ప్రారంభిస్తారు. సుజీత్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జస్ట్‌... ఆరు నెలల్లో షూటింగ్‌ కంప్లీట్‌ చేసేలా ప్లాన్‌ చేశారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement