సాహో.. ఎవరికీ తెలీదంట! | Saaho Director Maintenance Secrecy in Story, Says Actor Lal | Sakshi
Sakshi News home page

May 28 2018 11:59 AM | Updated on Jul 17 2019 9:52 AM

Saaho Director Maintenance Secrecy in Story, Says Actor Lal - Sakshi

సాహో ఫస్ట్‌ లుక్‌లో ప్రభాస్‌

దుబాయ్‌‌: యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా సాహో చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం కోసం ఎంపిక భారీ  స్టార్‌ క్యాస్టింగ్‌ను ఎంపిక చేసుకుంటూ పోతున్నారు. బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్‌ నుంచి పలువురు స్టార్లను తీసుకున్నారు. ఇప్పుడు దీనికి మాలీవుడ్‌ టచ్‌ కూడా ఇచ్చేశారు. మాలీవుడ్‌ సీనియర్‌ నటుడు లాల్‌(తెలుగులో అన్నవరం, ఖతర్నాక్‌ ఫేమ్‌) సాహో షూటింగ్‌లో పాల్గొన్నారు. అబుదాబి షెడ్యూలో అయిన చిత్ర యూనిట్‌తో కలిశారు. ప్రభాస్‌తో దిగిన ఫోటోను నాలుగైదు రోజుల క్రితం పోస్ట్‌ చేశారు కూడా. 

ఈ సందర్భంగా ఓ మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లాల్‌ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘ఈ చిత్రంలో నాది పాజిటివ్‌ పాత్ర. అంతకు మించి ఏం అడక్కండి. నేనూ చెప్పలేను. ఎందుకంటే ఈ సినిమా కథను దర్శకుడు నాక్కూడా పూర్తిగా చెప్పలేదు. నాకే కాదు ఇప్పుడు షూటింగ్‌లో పాల్గొంటున్న తారలేవరికీ ఈ చిత్ర కథ పూర్తిగా తెలీదు. ఇంకా చాలా షూటింగ్‌ జరుపుకోవాల్సి ఉంది. బహుశా అందుకే లీకులు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారేమో’ అని లాల్‌ చెప్పారు. 

ఈ లెక్కన్న కథ విషయంలో సుజిత్‌ చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడన్నది అర్థమౌతోంది. ప్రభాస్‌ సరసన బాలీవుడ్‌ సుందరి శ్రద్ధాకపూర్‌ హీరోయిన్‌గా, శంకర్‌-ఎహ్‌సన్‌-లాయ్‌ త్రయం సంగీతాన్ని అందిస్తుండగా, యూవీ క్రియేషన్స్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement