సాక్షి, హైదరాబాద్ : పోలీసులు అంటే ప్రజలకు ఒకరకమైన భయం. వారితో ఎందుకులే అని ఆమడ దూరంలో వెళ్లిపోతారు. ఎందుకంటే పురాతన కాలం నుంచి వారిపై ప్రజలకు ఉన్న చెడు అభిప్రాయం. కానీ వీటన్నింటికి భిన్నంగా హైదరాబాద్ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ వైపు అడుగులు వేస్తున్నారు. సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. సమయానుకూలంగా స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా రోడ్డు పక్కన తలదాల్చుకుంటున్న వారికి సహాయం అందిస్తున్నారు. అక్రమాలకు పాల్పడితే తాటతీసే పోలీసులు సామాజిక సేవా కార్యక్రమాల్లోను విరివిగా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే బుధవారం ట్రాఫిక్ పోలీసులు 8మంది ఇంటర్మీడియట్ విద్యార్థులను తమ వాహనంలో పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లారు.
నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు పారంభమైన సంగతి తెలిసిందే. పశ్చిమ మారేడ్‌పల్లి చెక్‌పోస్ట్ వద్ద విద్యార్థులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అర్ధాంతరంగా ఆగిపోయింది. పరీక్షకు సమయం మించి పోతుండటంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. అటుగా వెళ్తున్న ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు పరిస్థితిని గమనించి వారిని పరీక్షా కేంద్రం వద్ద విడిచిపెట్టారు. అంతేకాదు ప్రతిరోజు నగరంలోని ట్రాఫిక్ వివరాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అప్‌డేట్ చేస్తారు. ట్రాఫిక్ నియమాలను పాటించాలంటూ యువతకు అవగాహన కల్పిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment