![AP High Court Dismissed Amendment Petitions On Amaravati Padayatra - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/16/ap-high-court.jpg.webp?itok=4MyHa8nw)
సాక్షి, అమరావతి: అమరావతి పాదయాత్రపై సవరణ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. పిటిషన్లకు విచారణ అర్హత లేదని హైకోర్టు పేర్కొంది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై హైకోర్టు స్పందిస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించాలని స్పష్టం చేసింది.
చదవండి: సలహాదారులుగా ఎవరిని నియమించాలో ప్రభుత్వ ఇష్టం
కాగా, అమరావతే రాజధానిగా ఉండాలంటూ చేస్తున్న మహా పాదయాత్రపై గతంలో కూడా హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసిన తెలిసిందే. ఈ పాదయాత్రను రాజకీయ యాత్రగా హైకోర్టు తేల్చింది. రైతులను ముందుంచి ఇతరులు ఈ యాత్రను నడిపిస్తున్నారని స్పష్టం చేసింది. అమరావతికి అనుకూలంగా తాము తీర్పు ఇచ్చినప్పటికీ రైతులు పాదయాత్ర చేస్తుండటాన్ని ఆక్షేపించింది. రైతులు ఎందుకు పాదయాత్ర చేస్తున్నారని ప్రశ్నించింది. రాజధాని వ్యవహారంపై సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉండగా ఇలాంటి యాత్రలు చేయడం ఏమిటంటూ నిలదీసింది. యాత్రల ద్వారా కోర్టులపై ఒత్తిడి తెస్తున్నారా? అంటూ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment