మంత్రి హరీష్‌పై కేసు కొట్టివేత
వరంగల్‌లీగల్ : 2012లో పరకాల ఉప ఎన్నిక సందర్భంగా హరీష్‌రావుపై నమోదైన కేసును కొట్టివేశారు. వరంగల్ జిల్లా పరకాల శాసన సభ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా గీసుకొండ పోలీసులు హరీష్‌రావుపై పెట్టిన కేసును కొట్టివేస్తూ వరంగల్ మూడో మున్సిఫ్ మెజిస్టేట్ కోర్టు జడ్జి అజీజ్‌కుమార్ గురువారం తీర్పు వెల్లడించారు.
ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గీసుగొండ మండలం మచ్చాపూర్ గ్రామంలో నిర్వహించిన సభలో నాటి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కొండా సురేఖను వ్యక్తిగత దూషలు చేస్తూ మానుకోట ఘటన దృశ్యాలతో కూడిన పోస్టర్ హరీష్‌రావు విడుదల చేశారని... ఎన్నికల నిబంధనలను ఉల్లఘిస్తూ తమపై అసత్య ఆరోపణలు, ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా హరీష్‌రావు వ్యవహిరిస్తున్నారని కొండా సురేఖ ఎన్నికల కమిషనర్‌కు 2012 మే 30న ఫిర్యాదు చేశారు. నాటి ఎన్నికల రిటర్నింగ్ అధికారి విద్యాసాగర్ ఫిర్యాదు మేరుకు గీసుకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. సాక్షాధారలు, ఇరుపక్షాల వాదనలను పరిశీలించిన కోర్టు నేరం రుజువు కానందున మంత్రి హరీష్‌రావుపై ఉన్న కేసును కొట్టివేస్తున్నట్లు జడ్జి అజీజ్‌కుమార్ వెల్లడించారు. మంత్రి హరీష్‌రావు న్యాయవాదిగా బార్ అసోషియేషన్ మాజీ అధ్యక్షుడు గుడిమల్ల రవికుమార్ వ్యవహరించారు.