సాక్షి, హైదరాబాద్: మంత్రి కొప్పుల ఈశ్వర్ మధ్యంతర పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలంటూ కొప్పల ఈశ్వర్.. కోర్టుకు విన్నవించారు. మూడేళ్ల పాటు విచారణ జరిగి.. అడ్వకేట్ కమిషన్ దగ్గర వాదనలు ముగిశాక ఇప్పుడు సాధ్యం కాదన్న హైకోర్టు.. తుది వాదనలు వినాల్సి ఉందని పేర్కొంది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
కొప్పుల ఈశ్వర్ ఎన్నిక సవాల్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి లక్షణ కుమార్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈశ్వర్ స్థానంలో తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని కోరారు. లక్ష్మణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించాలంటూ మంత్రి మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
చదవండి: హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు కలకలం.. 15 బృందాలతో దాడులు
Comments
Please login to add a commentAdd a comment